గవర్నర్ ను కలిసిన వీహెచ్
హైదరాబాద్
దివాళి తరువాత మా ఇంట్లో జరుపుకునే సత్యనారాయణ వ్రతం కి గవర్నర్ ను ఆహ్వానించాను. హాజీపూర్ సంఘటన గురుంచి గవర్నర్ కి వివరించాను. హాజీపూర్ బాధితుల్ని పరామర్శించిన దాఖలు లెవని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. శుక్రవారం అయన రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ను కలిసారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ అదే కెసిఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వెంటనే పరామర్శిస్తారు . హాజీపూర్ బాధితుల్ని ఎందుకు పరామర్శించేలేదు కెసిఆర్ అని అన్నారు. అంబెడ్కర్ విగ్రహని పోలీస్ స్టేషన్లో పెట్టిన సంఘటన , ఇంటర్మీడియెట్, ఆర్టీసీ సమ్మె గురించి చెప్పాను. ఆర్టీసీ సమ్మెతో నలుగురు ఉద్యోగులు చనిపోయారు ..దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. కొత్త గవర్నర్ వచ్చాక మాకు న్యాయం జరుగుతోందని ఆశ కలుగుతుంది . నేను చెప్పిన అని అంశాల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని వీహెచ్ అన్నారు