ఎంపీ ల్యాడ్స్ లో ఖర్చు చేయని ఏపీ ఎంపీలు
న్యూఢిల్లీ,
నిధులు ఇవ్వడంలేదు, పైసా చేతిలో లేదు అంటూ తెల్లారిలేస్తే మన ప్రజాప్రతినిధులు దీర్ఘాలు తీస్తారు. తమకు నిధులు ఇవ్వాలంటూ పాలకులను చీటికీ మాటికీ డిమాండ్ చేస్తూంటారు. తీరా ఆ నిధులు ఇస్తే ఖర్చు పెట్టగలిగే ఓపికా, తీరికా, విజన్ ఉన్నాయా అన్నది ఇపుడు తేలిపోయింది. కేంద్రం ఇచ్చిన ఎంపీ ల్యాడ్స్ నిధులను మనవారు ఖర్చు చేయలేక మురగబెట్టారంటేనే అర్ధం చేసుకోవాలి ప్రజాసమస్యల పైన అంకితభావం, చిత్తశుద్ధి ఎంత వుందో. ఇందులో అన్ని పార్టీల వారు ఉండడం విశేషం అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన మన ఎంపీలు ఎక్కువగా ఉండడం విడ్డూరమే.పార్లమెంట్ సభ్యులకు స్థానిక ప్రాంత అభివృధ్ధి పధకం కింద మన రాజ్యసభ సభ్యులకు కేంద్రం కేటాయించిన 118 కోట్ల రూపాయలలో నాలుగవ వంతు ఏ మాత్రం ఖర్చు చేయకుండా తిరిగి కేంద్రానికే చేరిందంటే మన వాళ్ళను ఏమనాలో తెలియడంలేదంటున్నారు. కేంద్రం నిధులు ఇవ్వదు అంటూ నిత్యం కామెంట్స్ చేసే వారే తమకు ఇచ్చిన నిధులను మురగబెట్టేశారు. అచ్చంగా 29.10 కోట్ల రూపాయలు ఈ విధంగా వృధా అయ్యాయని పార్లమెంట్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పూర్తిగా ఖర్చు చేయని వారుగా బీజేపీ, వైసీపీకి చెందిన ఎంపీలు సీఎం రమేష్, వేమిరెడ్ది ప్రభాకరరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు ఎంపీలకు చెరి రెండున్నర కోట్ల రూపాయలు విడుదల చేయగా ఒక్క రూపాయి కూడా తాము ఎంచుకున్న నోడల్ జిల్లాకు వెచ్చించకుండా మురిగిపోయేలా చేశారట. ఇక మిగిలిన ఎంపీల్లో రెండున్నర కోట్లను పూర్తిగా ఖర్చు చేయకుండా మిగిల్చేశారట. అందులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్, టీడీపీ ఎంపీలు సీతామహలక్ష్మి, తోట సీతామహలక్ష్మి, సుజనాచౌదరి, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. నిధులు ఉంటే అభివృధ్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సి ఉంది, ఓ వైపు ఏపీ విభజన తరువాత దారుణంగా దెబ్బతింది. రూపాయి వచ్చినా బంగారంగా ఉంది. అలాంటిది మన ఎంపీలు తమకు వచ్చిన నిధులతో స్థానికంగానైనా అభివృద్ధి చేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని అంటున్నారు. అలాంటిది చేతి దాకా వచ్చింది, నోటిదాకా అందించలేని మన ప్రజాప్రతినిధులు మరెపుడు అభివృధ్ధి చేస్తారు, ఇంకెపుడు ఈ జనాలను ఉద్ధరిస్తారన్నది జనాలకు కలుగుతున్న అతి పెద్ద ప్రశ్న్హ. దీనికి వారి వద్ద జవాబు వుందా