YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

అష్ట లక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు

అష్ట లక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు

అష్ట లక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు
హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
ఈ అష్టలక్ష్ములు:
ఆదిలక్ష్మి : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
ధాన్యలక్ష్మి : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
ధైర్యలక్ష్మి : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించింది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
గజలక్ష్మి : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించింది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
సంతానలక్ష్మి : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించింది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉంది.
విజయలక్ష్మి : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
విద్యాలక్ష్మి : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
ధనలక్ష్మి : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.

Related Posts