YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నామినేటెడ్ పదవులలో గిరిజనులకు న్యాయం చేయాలి 

నామినేటెడ్ పదవులలో గిరిజనులకు న్యాయం చేయాలి 

నామినేటెడ్ పదవులలో గిరిజనులకు న్యాయం చేయాలి 
నంద్యాల
ఆంధ్రప్రదేశ్  గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర నాయకులు శనివారం నాడు నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు నామినేటెడ్ పదవులలో సముచిత స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు . గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు గడుస్తున్నా గిరిజనులకు అన్ని రంగాలలో స్థానచలనం కల్పించ లేదన్నారు .గిరిజన మైదాన ప్రాంతం లో  గల గిరిజనులకు కు నామినేటెడ్ పదవి మరియు ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు . అన్ని కులాల వారికి చేసిన న్యాయం లాగానే గిరిజనులకు కూడా 20% రిజర్వేషన్ కల్పించి న్యాయం  చేయాలని.  స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు  ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు .
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో గిరిజన కులాలకు చెందిన వారికి నామినేటెడ్ పదవులను ఇచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. రాజకీయంగా వెనుకబడిన గిరిజన కులాలను చైతన్య పరిచే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేయాలని కోరారు. 
గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నా రే తప్ప వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగ నివ్వ కుండ చేశారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలన్నారు. తన ప్రజా సంకల్ప  పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని కులాల వర్గాల వారిని రాజకీయంగా. సామాజికంగా. రిజర్వేషన్ కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటాడని ఆశిస్తూ రాష్ట్రంలో ఇవ్వబోయే నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం గిరిజనులకు ఇవ్వాల్సిన 20 శాతం అవకాశాన్ని నామినేటెడ్ పదవులు కల్పించి గిరిజనులకు రాజకీయంగా ఎదిగేందుకు  దోహదపడాలి అన్నారు. విద్య ఉద్యోగాల్లోనే  కాకుండా రాజకీయ, ప్రభుత్వ పదవుల్లో గిరిజనులకు న్యాయం చేసినప్పుడే గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి  చెందుతారని అన్నారు, ఈ సమావేశంలో లో గిరి జన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి నాయక్. రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్జి. జిల్లా అధ్యక్షులు బాలు నాయక్. గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాయక్. యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts