YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అన్ని రూట్లలో బస్సులు నడపాలి   ఆర్టీసీ డిఎం ను ఆదేశించిన కలెక్టర్

అన్ని రూట్లలో బస్సులు నడపాలి   ఆర్టీసీ డిఎం ను ఆదేశించిన కలెక్టర్

అన్ని రూట్లలో బస్సులు నడపాలి   ఆర్టీసీ డిఎం ను ఆదేశించిన కలెక్టర్
వనపర్తి 
జిల్లాలోని అన్ని రూట్లలో ఆదివారం నుంచి బస్సులు నడపాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వనపర్తి డిఎం దేవదానం ను ఆదేశించారు.        శనివారం కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ అపూర్వ రావు, ఇతర అధికారులు వనపర్తి బస్ డిపో ను సందర్శించి, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా బస్సుల నిర్వహణ, బస్సు కండక్టర్ లు, డ్రైవర్లు, బస్సుల అందుబాటు,రూట్ల నిర్వహణ పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 38 రూట్లకు గాను ప్రస్తుతం 23 రూట్ల లో బస్సులు నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంత రూట్ల పై కొత్తగా వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన లేనందున ఆ రూట్లలో బస్సులను నడపలేక పోతున్నట్లు డి ఎం కలెక్టర్కు వివరించారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ 15 రూట్ లకు 15 మంది విఆర్వోలు, కానిస్టేబుళ్లను ఇస్తామని, వారి సహకారంతో ఆ రూట్లలో కూడా బస్సులు నడపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బస్సుల ఫ్రీక్వెన్సీ, ప్రతిరోజు వస్తున్న రాబడి, ప్రయాణికుల వివరాలు, బస్సులు తిరుగుతున్న కిలోమీటర్ల వివరాలు, అందుబాటులో ఉన్న డ్రైవర్లు, కండక్టర్ ల సంఖ్య, ప్రైవేట్ బస్సులు, అద్దె బస్సుల తో పాటు నడుపుతున్న మాక్స్ క్యాబ్ లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్లు కండక్టర్లకు ఏప్పటి పేమెంట్ అప్పుడే చెల్లించాలని, అవసరమైనంత మంది మెకానికల ను, స్వీపర్లను ఏర్పాటు చేయాలని, ఎప్పటిలాగే బస్ పాసులు కూడా జారీ చేయాలని ఆదేశించారు. డ్రైవర్లు కండక్టర్లను మ్యాచింగ్,బ్యాచింగ్ ద్వారా వి ధులు కేటాయించాలని ఆదేశించారు. ప్రయాణికుల వివరాలతో పాటు, బస్సులు ఎన్ని ట్రిప్పులు నడుస్తున్నది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. లెక్కల నిర్వహణకు గాను అకౌంటెంట్లు కావాలని కోరగా తక్షణమే కలెక్టర్ కార్యాలయం నుండి సిబ్బందిని వారం రోజుల పాటు డిప్యూటేషన్ పద్ధతిపై ఆర్టీసీ డిపోకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురి కాకుండా బస్సులు నడపాలని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.      రవాణా శాఖ అధికారి నరేంద్ర నాయక్, ఆర్ డి ఓ కే . చంద్రారెడ్డి. సి ఐ సూర్య నాయక్ తాసిల్దార్ రాజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Related Posts