
గుంటూరులో 2 కిలోల బంగారం చోరీ
గుం టూరు,
తమిళనాడులోని తిరుచ్చి లలితా జ్యూయలర్స్‌లో కోట్ల విలువైన బంగారు నగలు చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దొంగలు చక్కగా వచ్చి ఎంచక్కా పని కానిచ్చేసి వెళ్లిపోయారు. అలాంటి భారీ దొంగతనం మరొకటి ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కోట్లలో కాకపోయినా భారీగానే బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. రెండు కిలోలకు పైగా బంగారం దొచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.నరసరావుపేటకు చెందిన వైభవ్ జ్యూయలర్స్ యజమాని పెనుగొండ ప్రతాప్ ఆ నెల 6న బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి 9వ తేదీన ఇంటికి వచ్చారు. దాచి ఉంచిన బంగారు నగల కోసం బీరువా తెరిచి చూసి హతాశుడయ్యాడు. బీరువా లాకర్‌లో ఉంచిన బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి కానీ ఇంట్లో బంగారు నగలు మాయమయ్యాయని వాపోయాడు. రెండు కిలోల బంగారు నగలు అపహరణకు గురైనట్లు ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ సేకరించే పనిలో పడ్డారు.