YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

రెండో టెస్ట్ లో సఫారీల విలవిల

రెండో టెస్ట్ లో సఫారీల విలవిల

రెండో టెస్ట్ లో సఫారీల విలవిల
ముంబై, 
భారత్, సౌతాఫ్రికా మధ్య పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడుతున్నారు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి, సౌతాఫ్రికాను పూర్తిగా ఒత్తిడిలో పడేశారు. ఇప్పటివరకు ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ డుప్లెసిస్(64)ను అశ్విన్ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా 60 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇంకా మొదటి ఇన్నింగ్స్‌లో 434 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో ఉమేష్ 3 వికెట్లు తీయగా.. షమీ, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ తీశాడు. 

Related Posts