టీటీ టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి అవంతి
విశాఖపట్నం
రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ను విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ తో పాటు విశాఖ ఎంపి సత్యన్నారాయణ పాల్గోన్నారు.విశాఖను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.అగనంపూడిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఒత్తిడిని అధిగమించడానికి క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి జిల్లాలో అన్ని క్రీడల్లో సీఎం కప్ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామని అన్నారు, అన్ని సదుపాయాలతో ప్రతి జిల్లాలో స్పర్ట్స్కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జపాన్ దేశపు ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు..