సమాచార హక్కు చారిత్రాత్మకం
నెల్లూరు
నెల్లూరులోని క్రిష్ణచైతన్య డిగ్రీ కళాశాలలో సమాచార హక్కు జనవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమాచార హక్కుచట్టం అవగాహన సదస్సులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా సమాచార హక్కు చట్టం సద్వినియోగంలో కీలకపాత్ర పోషిస్తున్న వారికి సత్కారం చేసారు. సోమిరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 14 ఏళ్లు పూర్తయింది..ఈ చట్టం చారిత్రాత్మకమైనది. రాజస్థాన్ లో పేదల ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీయడంలో భాగంగా జరిగిన పోరాటం సమాచార హక్కు చట్టం అమలులోకి రావడానికి మూలకారణమైందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ చట్టం అమలులోకి వచ్చింది...అయితే ఆ
ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యకలాపాలు ఆ చట్టసాయంతోనే వెలుగులోకి వచ్చాయి. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ, 2జీ, కామన్ వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణం లాంటి అనేక స్కాంలు ఈ చట్టం ద్వారానే వెలుగులోకి రావడం గొప్పవిషయమని అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో అప్పటి మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్, 2జీ స్కాం విషయంలో అప్పటి కేంద్ర టెలికాం మంత్రి రాజా రాజీనామాకు సమాచార హక్కు చట్టం కారణమైంది.
ప్రజాస్వామ్యదేశంలో ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి...ప్రజాపన్నులతోనే పాలన జరుగుతుంది...వాటి ద్వారా పాలన ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. తోటపల్లి గూడూరు మండలం పంచాయతీలో బలహీనవర్గాల రైతులు సాగు చేసుకుంటున్న రొయ్యల గుంతలు అటవీ భూములంటూ వందల మంది పోలీసులను
తీసుకొచ్చి మిషన్లతో ధ్వంసం చేసి లక్షలాది రూపాయల విలువజేసే రొయ్యలను సముద్రం పాల్జేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరిస్తే అవి అటవీ భూములు కాదని పట్టపుపాళేలకు చెందిన గ్రామకంఠం భూములని స్పష్టమైందని అయన వ్యాఖ్యానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారి ఆటకట్టించేదే సమాచార
హక్కు చట్టం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సమాచార హక్కు చట్టం అమలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో 8 మంది సమాచార కమిషనర్లు ఉండేవారు..విభజన తర్వాత తెలంగాణలో ఇద్దరు కమిషనర్లను మాత్రమే నియమించగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఐదుగురు కమిషనర్లను నియమించారు.
యువత చదువు, పుస్తకాలు, ఉద్యోగాలకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా సమాచార హక్కు చట్టం ద్వారా పోరాడాలి...అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోండి. యువతను నేను కోరే మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే...ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు
చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని అన్నారు.