YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇసుక ఇబ్బందులను పరిష్కరించాలి

ఇసుక ఇబ్బందులను పరిష్కరించాలి

ఇసుక ఇబ్బందులను పరిష్కరించాలి
అమరావతి
నూతన ఇసుక పాలసీపై జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో సచివాలయంలో వర్క్ షాప్ జరిగింది. ముఖ్యఅతిథిగా  పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది శాఖామంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గోన్నారు. వివిధ జిల్లాలకు చెందిన జెసిలు, మైనింగ్ అధికారులు కుడా హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలి. ప్రస్తుతం రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోంది.  దీనిని రోజుకు లక్ష టన్నులకు పెంచాలి.  గత మూడు నెలలుగా వరద పరిస్థితి కొనసాగుతుండటం వల్ల ఇసుక తవ్వకాలకు ఇబ్బందులని అన్నారు. వరదలు తగ్గే వరకు ప్రత్యామ్నాయంగా పట్టాదారు భూముల్లోని ఇసుకపై దృష్టి సారించాలి.  ఇప్పటికే ఇసుక తవ్వకాల కోసం పలు జిల్లాల నుంచి పట్టాదారులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు.  తక్షణం ఈ దరఖాస్తులను ఆమోదించి, ఇసుక తవ్వకాలు ప్రారంభించాలి.  ఇసుక సరఫరాపై జాయింట్ కలెక్టర్ లకు బాధ్యతలు అప్పగించాం.  అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సిఎం ఆదేశాలు. రీచ్ లకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ లను గుర్తించాలి.   ఓపెన్ రీచ్ ల్లో వరద పరిస్థితి కారణంగా ఇసుక తవ్వకాలు చేయలేకపోతున్నాం. గత మూడు నెలలుగా కృష్ణానదిలో వరద పరిస్థితి కొనసాగుతోంది.  జలాశయాల్లో, స్థానిక జలవనరుల్లో మేటవేసిన ఇసుక నిల్వలలను గుర్తించాలి. వీటిని బయటకు తీయడం వల్ల అటు జలాశయాల నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది, మరోవైపు ఇసుక సరఫరా మెరుగవుతుంది.   మెదటి, రెండు, మూడు గ్రేడ్ లలోని రీచ్ లలో ట్రాక్టర్ లకు అనుమతి ఇస్తామని అన్నారు. గ్రామ సచివాలయాల సిబ్బందిని రీచ్ లవద్ద పెట్టి ఆన్లైన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలి.   మైనింగ్ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ లతో సమన్వయం చేసుకోవాలి.   ఇసుక లభ్యత వున్న జిల్లాల్లో స్థానికుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న సంబంధిత జిల్లా వాసులకు కొంతమేర ఇసుకను రిజర్వు చేయండి. ఇసుక అవసరాల కోసం ఆన్లైన్ లో వస్తున్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని మంత్రి అన్నారు.

Related Posts