YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సమ్మె చట్టవిరుద్దం

సమ్మె చట్టవిరుద్దం

సమ్మె చట్టవిరుద్దం
హైదరాబాద్, 
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని మంత్రి పువ్వాడ తెలిపారు. సమ్మెను ప్రయాణికుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారని మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్లో ట్రాన్స్ పోర్ట్ భవన్ లో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, భాజపాపాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా?అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా? అని పువ్వాడ ప్రశ్నించారు. ‘ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోంది. విధానపరంగా ఆర్టీసీ ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్మెంట్ ఇస్తారని అనుకున్నప్పటికీ.. కార్మికులకు రాష్ట్రప్రభుత్వం 43 శాతం ఇచ్చింది’’ అని చెప్పారు.తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుస్తున్న ఆర్టీసీ సర్వీసులతోపాటు వివిధ ప్రైవేటు వాహనాల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని మంత్రి  హెచ్చరించారు. సమ్మె విషయంలో అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నమన్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందన్నారు . సమ్మె పరిష్కారం కోసం ముగ్గురు ఐఏఎస్లతో ప్రభుత్వం కమిటీని నియమించిందని, దానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ కూడా ముగిసిందని ఈ నెల నాలుగో తేదీనే చెప్పామని పువ్వాడ గుర్తు చేశారు. బస్సులను నడిపేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రతి ఆర్ఎం కింద పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. బస్పాసులు అనుమతించేలా చర్యలు తీసుకుంటామని పువ్వాడ వెల్లడించారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూలు బస్సులను ప్రజారవాణా కోసం తీసుకోబోమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సంస్థలో చాలా బస్సులు ఉన్నాయని, వాటిని నడిపే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.

Related Posts