38వ ఏట మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన శరద్ పవార్(ఎన్సీపీ అధినేత) తన రాజకీయ అనుభవం గురించి ఎన్నడూ ఉపన్యాసాలివ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి అయినపుడే ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ సీఎం చంద్రబాబు దేశంలోనే తానో అరుదైన రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి అన్నట్టు లక్ష సార్లు చెప్పుకున్నాడని' వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం పలు అంశాలపై ఆయన ట్విటర్లో స్పందించారు.అసెంబ్లీలో తను మాట్లాడుతుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వణికే వారని చంద్రబాబు సొంత డప్పు కొట్టుకుంటున్నారు. అప్పట్లో వైఎస్సార్ వాగ్దాటికి బాబు ఏ విధంగా ఊచకోతకు గురయ్యేవారో అందరికీ తెలుసు. ఆయనిప్పుడు లేరు కదాని కథలు వినిపిస్తున్నాడు. ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్లి చూడండి. విశ్వసనీయత, నిజాయితీ అనేవి చంద్రబాబు డిక్షనరీలో ఉండవు. నయవంచన, మ్యానిప్యులేషన్ల ద్వారా రాజకీయ వైకుంఠపాళిలో పైకి ఎగబాకిన వ్యక్తి. దోషాలు లేని వ్యక్తిత్వాన్ని ఆయన నుంచి ఆశించలేం. తను మారాలని కూడా అనుకోడు. నక్కజిత్తులతో ప్రజలను ఎలా వంచించాలని నిరంతరం యోచిస్తుంటాడు. మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు అండ చూసుకుని ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేశాడు. ఇప్పుడు తనే పెద్ద బ్రేకింగ్ న్యూసై పోయాడు. వంద కోట్లు ఏం ఖర్మ వెయ్యి కోట్లకు వేసుకో 'పరువు' నష్టం దావా' అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.