YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గంటా కు చెక్ తో జోష్ లో అవంతి

గంటా కు చెక్ తో జోష్ లో అవంతి

గంటా కు చెక్ తో జోష్ లో అవంతి
విశాఖపట్టణం, 
విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫుల్ హ్యాపీస్ అంటున్నారు వైసీపీ నేతలు. అతి పెద్ద జిల్లాకు ఏకైక మంత్రిగా పార్టీలోకి వస్తూనే ఛాన్స్ కొట్టేసిన అవంతి శ్రీనివాసరావుకి తొలి రోజుల ఆనందం తరువాత కాలంలో ఆవిరైంది. దానికి కారణం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎపిసోడ్. గంటా వైసీపీలోకి వస్తారంటూ గత మూడు నెలలుగా విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో అవంతి శ్రీనివాసరావు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారు. గంటా వైసీపీలోకి వస్తే తన రాజకీయ ఆధిపత్యానికి చెక్ పడుతుందని భయపడ్డారు. ఓ విధంగా చిగురుటాకులా వణికిపోయారు.అయితే మూడు నెలల ఈ ఎపిసోడ్ కి ఇపుడు తెరపడిపోయింది. జగన్ షరతులు గంటాకు నచ్చలేదని, గంటా డిమాండ్లు జగన్ ఒప్పుకోలేదని ఇపుడు విశాఖ జిల్లా రాజకీయాలలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. గంటా ఎమ్మెల్యే పదవికి ఓ దశలో రాజీనామా చేయలనుకున్నా ఆయన భవిష్యత్తు రాజకీయానికి కోరిన విధమైన భరోసా దక్కలేదని అంటున్నారు. పైగా విశాఖ జిల్లా వైసీపీ రాజకీయాల్లో గంటా రాకను స్వాగతించే వారు పెద్దగా లేకపోవడం మైనస్ పాయింట్ గా మారిందని అంటున్నారు. దీంతో అవంతి శ్రీనివాసరావు మంచి జోష్ లో ఉన్నారు.గంటా వైసీపీలోకి వస్తే బలం మాట దేముడెరుగు వర్గ పోరు బాగా పెరిగిపోతుందని వైసీపీకి నివేదికలు వచ్చాయట. పైగా గంటా బలమైన నాయకుడైనప్పటికీ ఆయన పట్ల జనంలోనూ వ్యతిరేకత ఉందని, అది కొత్త ప్రభుత్వం మీద కూడా పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆచీ తూచీ నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇక గంటా రాకతో పాటే ఆయన వెంట వచ్చే వర్గం తమకు ఎక్కడ పోటీ అవుతారోనని వైసీపీ నేతలు చాలా మంది భయపడ్డారు. ఈ పరిణామాల నేపధ్యంలో గంటా వద్దు అంటూ జిల్లావ్యాప్తంగా నేతలు కోరారని అంటున్నారు. మరో వైపు గంటా రావాలని కోరుకున్నది ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమేనని కూడా అంటున్నారు. మొత్తానికి గంటా విషయంలో వైసీపీ హై కమాండ్ ఆలోచనలు ఒకలా ఉంటే వైసీపీ పట్ల గంటా ఆలోచనలు మరో విధంగా ఉండడంతో ఆయన రాకకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. దీని వెనక అవంతి శ్రీనివాసరావు ఉన్నారు.తాజాగా మారిన పరిణామాలతో అవంతి శ్రీనివాసరావు ఇపుడు కింగ్ అంటున్నారు. ఆయన విశాఖ జిల్లా రాజకీయాల్లో మరో రెండున్నరేళ్ళ పాటు మంత్రిగా ఉంటారు. ఆయన పనితీరు బాగుంటే జగనే అయిదేళ్ళ పాటు మంత్రిగా కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే గంటా బెడద తొలగిందని సంబరపడుతున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు తాను బాధ్యతగా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విశ్వాసం ముందు పొందాలి. నాయకులను కలుపుకుని ముందుకు సాగాలి. అధినాయకత్వం మంత్రి పదవి ఎందుకు ఇచ్చిందో గుర్తు చేసుకుని దానికి తగినట్లుగా విశాఖ అర్బన్ జిల్లాలో వైసీపీని పటిష్టం చేయాలి. రానున్న స్థానిక ఎన్నికల్లో ఇటు జీవీఎంసీలోనూ, అటు జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగిరేలా చూడాలి. అపుడే అవంతి శ్రీనివాసరావు ఫుల్ హ్యాపీస్ గా ఉంటారని అంటున్నారు. మరి గంటా సహచరుడైన అవంతి శ్రీనివాసరావు సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేయలేం కానీ ఆయన మరింతగా చొరవ చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

Related Posts