YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

లార్డ్ కృష్ణకు 16,000 భార్యలు ఎందుకు ఉన్నారు?

లార్డ్ కృష్ణకు 16,000 భార్యలు ఎందుకు ఉన్నారు?

లార్డ్ కృష్ణకు 16,000 భార్యలు ఎందుకు ఉన్నారు?
శ్రీ కృష్ణపరమాత్మ పదహారు వేల మంది(16000) గొపికలతొ క్రీడించాడని అంటారు. ఆయన్ను మంచి వాడు కాదు అన్న విధంగా చూపిస్తారు. అసలు సంగతి తెలియాలి అంటే ముందు కొన్ని తెలుసుకొవాలి.
రామావతారంలొ రాముడు మానవుడిగానే జీవించాడు. అది త్రేతాయుగం నాటి మాట. ద్వాపరయుగంలొ కృష్ణావతరం పరిపూర్ణావతారం. అంటే కృష్ణుడు పుట్టడమే నాలుగు భుజములతొ శంకు చక్ర గదా పద్మములతొ పుట్టి సాధారణ మానవుడిగా మారాడు. రాముడు ఏనాడు మాయలు చెయ్యలేదు. కాని కృష్ణుడిగా మాత్రం ఎన్నొ లీలలు చేసాడు. ఇది రెండు అవతారాలా మధ్య ఉన్న తేడా.
రాముడి వనవాస కాలంలొ ఆయన్ను చూసి మహర్షులు సైతం మొహించారట."పుంసాం మొహన రూపాయ" అని కదా.ఆ సుందరమైన రూపాన్ని చూసిన మహర్షులు ఒక్కసారి కౌగిలించుకోవలని ఉంది రామా అన్నారట.అందుకు రాముడు రాబొయే యుగంలొ ఆ అవకాశం ఇస్తానని చెప్పాడు.ద్వాపరయుగంలొ వారు అందరూ గొపికలుగా వేషాలు ధరించారు.కృష్ణుడ్ని పతిగా పొందాలని,ఆయన్ను చేరాలని "కాత్యాయని వ్రతం" ఆచరించి అమ్మవారిని వరం అడిగారు.ఇక్కడ కాత్యాయని అంటే అర్దం ఏంటొ తెలుసా?ఒక్కప్పుడు ఒక ఆయన మహర్షులందరిని మార్గమేది మార్గమేది అని అడిగేవారు.మార్గం దేనికి అంటే పరమపదసోపానానికి,శాశ్వతమైన చోటుకి,పరమేశ్వరునిలొ ఐక్యానికి.అలా తపించి తపించి ఆయన తాపసి అయ్యారు.జ్ఞానం పొంది జ్ఞాని అయ్యారు.మౌనం వహించి ముని అయ్యారు.తర్వాత మహర్షి అయ్యారు.అప్పుడు ఆయన భక్తికి మెచ్చి జగన్మాత ఆయనకు కూతురుగా "కాత్యాయని"గా అవతరించింది.ఆయనకు సత్ మార్గాన్ని చుపించింది.అటువంటి కాత్యాయని దేవిని వరు ఏమి కొరుకున్నారు అంటే కృష్ణపరమాత్మను చేరాలి,ఆయనలొ రమించాలి, బ్రహ్మానందాన్ని పొందాలి అని.వరంపొంది ఎవరిని చేరితే ఇక మళ్ళీ జన్మ ఉండదొ అటువంటి స్వామిని వారు పొందారు. కృష్ణుడు ఆత్మస్వరూపుడు.వారికి కృష్ణపరమాత్మకు శారీరిక సంబంధం ఉన్నట్టు ఎక్కడైన ఉందా చెప్పండి.కృష్ణుడు దేవుడన్న సంగతి అందరికి తెలుసు,కాబట్టి దేవున్ని చేరారు తప్ప ఒక వ్యక్తిని కాదు.
ఇంకొక విషయం ఏమిటి అంటే కృష్ణుడు ఎప్పుడు ఏవరిని మొహించాలేదు. అందరు వాసుదేవుడ్నే మోహించారు. కృష్ణుడు గొపికల సహవాసం ఎప్పుడైన కొరుకున్నాడ? కాదు. గొపికలే కృష్ణతత్వంలొ ఆనందించి ఆయన కొసం తపించారు.పరమాత్మ దగ్గరకు చేరారు.
కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి.మహాయోగి.ఆయనే పరమాత్మ.కృష్ణపరమాత్మ పరబ్రహ్మం.మనము ఆత్మస్వరూపం. అదే కదా భగవద్గీత సారాంశం. మనం శరీర పరంగా చూసినప్పుడు మనం స్త్రీ పురుష బేధం ఉంటుంది.కాని ఆత్మ స్త్రీ స్వరూపంగా ఇక్కడ భావించబడింది. నది సముద్రంలొ కల్సిన విధంగా ఆత్మ ఆ సత్చిదానంద ఘనపరమాత్మలొ కలవాలి.ఆ పరమాత్మ పురుష రూపంగా భావించబడింది మన భాగవతంలొ. అంటే ఈ లొకంలొ అన్నిటిని భరించే భర్త ఒక్క పరమేశ్వరుడే. మిగితా జీవరాశి అంతా ఆయనచే భరించబడుతొంది. అదే తత్వజ్ఞానం.కృష్ణ దర్శనంతొ గొపికలకు కూడా అదే తత్వజ్ఞానం బొధపడింది.అందుకే వారు అన్నిటిని సన్యసించి కృష్ణుడ్నే అంతటా చూసినవారై ఆయనే భర్తని తెలుసుకొని వేరె అన్నిటిని వదిలి ఆ ఆత్మస్వరూపాన్ని తమలొనే ఉందని గ్రహించి,వారిలొ ఉన్న ఆ పరమాత్మలో తమను తాము ఐక్యం చేసుకొని బ్రహ్మజ్ఞానన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందారు.అల వారు ఆ అత్మస్వరూపమైన ఆ తత్వంలొనే రమించారు.శాశ్వతమైన ఆనందాన్ని పొందారు అని ఉందే కాని ఎక్కడా వారు తాత్కాలికమైన సుఖాలను కృష్ణుడి ద్వారా పొందారని ఎక్కడైన ఉందా చెప్పండి?
మన శరీరం సప్తధాతువులతో,నవరంధ్రాలతొ ఉందా లేదా?అటువంటి ఈ శరీరాన్ని అశాశ్వతమని భావించి ఆ శరీరాన్ని అదుపులొకి తెచ్చుకొవడానికి ఎంతొ వ్యయ ప్రయాసలకు లొను అవ్వాలి.మొత్తం ఆ నవరంధ్రాలు,సప్తధాతువులు కలిపి మొత్తం పదహారు.సంస్కృతంలొ వేలను సహస్రం అంటారు.సహస్రం అంటే అనంతం అని అర్దం.ఈ శరీరాన్ని అదుపులొకి తెచ్చుకొవడమే అనంతమని ఆ పదహారు వాటిని అదుపులొకి తెచ్చుకొని అ పరమాత్మునిలొ ఆత్మను లయం చేయడం అని అర్దం.అటువంటి అనంతమైన,అతి కష్టమైన ఈ మార్గన్ని అనుసరించి ఆయన్ను చేరుకున్న వారు ఆ గొపికలు అని అర్దం.అంతే కాని కృష్ణ్ది మీద లేనిపొని అబాంఢాలు వేయ్యొద్దు.
అలాగే పంచజ్ఞానేంద్రియాలు,పంచకర్మేంద్రియాలు,పంచ భూతాలు,మనస్సు కలిపి పదహారు(16).అనంతమైన వాటి మాయాను జయించడం కష్టం.అటువంటి వాటిని జయించి ఆత్మస్వరూపమైన ఆ పరమాత్మను ఎరుకలొకి తెచ్చుకొని వాటిని జయించినవారు ఆయన్ను తమలొనే దర్శించినవరికి ఆత్మానందాన్ని ఇచ్చాడు.ఇప్పుడు పైన చెప్పిన ఆ పదహారు మనలని మాయలొ ఉంచే ముఖ్యసాధనాలు.వాటి మాయ చేష్టలు అనేకం.మనం వాటిలొ బ్రతికి మాయకు వశులమవుతున్నాం.అటువంటి ఆ పదహారు కూడా ఆ పరమాత్ముడ్ని ఏమి చేయలేక ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాయి అని.సహస్రశీరుష పురుషః సహస్ర్రక్షర్ సహస్ర పాత్ అని పురుష సూక్త వచనం. ఆయనకు వెయ్యి తలలు, కన్నులు, పాదాలు అని అర్దం. అంటే ఆయన అనంతుడు. ఇందాక చెప్పినట్టుగా సహస్రం అంటే అనంతం అని.అనేక విధాలుగా ఉన్న ఆ పరమాత్మ మాయను దాటి ఆయన్ను చేరారు అని అర్దం.
కృష్ణుడు ప్రతి గొపికకు కనిపించాడని భాగవతం చెప్పింది. అంటే పదహారువేల కృష్ణ పరమాత్మలు ఉన్నారా? పదహారు వేలు ఏంటి అంతటా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి ఆ పరమేశ్వర తత్వం.ఆ ప్రాణశక్తిని తెలుసుకొని రమించినచారు గొపికలు.
చివిరిగా ఒకమాట. కృష్ణుడితొ ఏవరికి దేహసంబంధం లేదు.ఆయనతొ ఉన్నది ఆత్మ సంబంధం మాత్రమే.

Related Posts