ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు నష్టాలతోనే బుధవారం ప్రారంభమయ్యాయి. అనంతరం అంతకంతకూ అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. చివరి గంట ట్రేడింగ్‌లో కాస్త కోలుకున్నాయి. బ్యాంకుల సపోర్టుతో స్వల్ప నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 21 పాయింట్ల నష్టంలో, 33,835 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంలో 10,410 వద్ద స్థిరపడ్డాయి. మిడ్ సెషన్ సమయానికి సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టాల్లోకి జారింది. మరోసారి భారీ నష్టాలు తప్పవనే అంచనాలు వస్తుండగా.. చివరి గంటలో మార్కెట్లు కోలుకున్నాయి.