ముమ్మరంగా పెసర కోతలు
నిజామాబాద్,
పెసర, మినుము పంటల కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా, కోతల కు కూలీల కొరత ఉండటంతో రైతన్నలు మిషన్ల సహాయంతో కోతలను ముమ్మరం చేశారు. గతంలో కంటే ప్రస్తుతం కోతలు స్పీ డు గా కొనసాగుతున్నాయి. కాగా, కూలీలు దొరికే సమయంలో వాతావరణం అనుకూలిస్తుందా లేదా అని చూసేవారమని, మిషన్లు గం టల్లో కోతలను చేపట్టి చేతికి ధాన్యం అందిస్తుండటంతో పని సులువుగా అవుతుందన్నారు. కూలీల కంటే ఎక్కువ ధర ఉన్నా, చేతికొచ్చిన పంట ఎక్కడ చేజారుతుందోననే భయంతో మిషన్ల సహాయంతో కోతలు చేపడుతున్నట్లు రైతన్నలు అభిప్రాయ పడుతున్నారు.మండలంలోని ఆయా గ్రామాల శివారుల్లో ఇప్పటికే పెసర, మినుము కోతలు పూర్తవుతూ వస్తుండగా, మరికొన్ని రోజుల్లో దసరా పండుగ అనంతరం సోయా చేతికొస్తుందని, దీంతో మిషన్లకు గిరాకీ పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు. మిషన్ల సహాయంతో కోతలను ముమ్మరంగా చేపడుతుండటంతో మండలంలోని ఆయా గ్రామాల శివారుల్లో మిషన్ల మోతలు మోగుతున్నా యి. ఎన్ని ఎకరాలున్నా గంటల వ్యవధిలో పం టను కోస్తుండటంతో రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. గతంలో పంటలు కోసే సమయం లో అకాల వర్షం కురిసి పంటలు నేలపాలైన సంఘటనలను చూసి రైతన్నలు మిషన్ల సహాయంతో కోతలు చేపడుతున్నారు. పంటలు కో సి పెట్టినా రాత్రి సమయంలో వర్షం పడితే ఏం చేయలేకపోవడంతో పాటు కూలీలు కూడా సకాలంలో దొరుకక పోవడంతో ఈ విధంగా చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు.సకాలంలో కూలీలు దొ రుకక పోవడంతో మిషన్లను ఆశ్రయిస్తున్నాం. వాతావరణంలో సైతం మార్పులు కనబడుతుండటంతో కూలీలు వా రం రోజులు చేసే పని మి షన్లు కేవలం గం ట ల్లో చేస్తుండటంతో కాస్త ఎ క్కువ రేటైనా మిషన్ల సహాయంతో పంట కోతలు చేపడుతున్నాం. దీంతో చేతికొచ్చిన పంట ఇంటికి చేరుతుందంటున్నారు రైతులు