YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

కర్ణాటకకు కొడంగల్  ధాన్యం

కర్ణాటకకు కొడంగల్  ధాన్యం

కర్ణాటకకు కొడంగల్  ధాన్యం
పాలమూరు,
కొడంగల్‌ మార్కెట్‌యార్డులోకి వస్తున్న ధాన్యం దాదాపు 90 శాతానికి పైగా కర్ణాటక నుంచి వస్తుంది. కర్ణాటక ముదెళ్లి, రెబ్బన్‌పల్లి, కండ్రెపల్లి, కొల్కుంద, దుగునూర్‌ వంటి ప్రాంతాల్లో పెసర విస్తారంగా పండించారు. ఒక్కో రైతుకు దాదాపు 50 బస్తాల వరకు పంటలు దిగుబడి రావడంతో తెలంగాణకు తరలిస్తున్నారు. కర్ణాటకలో క్వింటాలు ధర రూ.4వేలు ఉంది. కొడంగల్‌లో రూ.6,950 ఉండడంతో ఒక క్వింటాకు దాదాపు రూ.3వేలు అధికంగా రావడతో ఈ ప్రాంతానికి తరలి వస్తుంది. పైగా చెక్‌ పోస్టులు లేకపోవడంతో అక్కడి రైతులు ఉత్పత్తులను  కొడంగల్‌కు వస్తున్నారు. ఈ ప్రాంత రైతుల పేర్లపై, బంధువుల పాసుపుస్తకాలపై పంటలను విక్రయిస్తున్నారు.ప్రతి రోజు రాత్రి, ఉదయం తేడాలేకుండా విచ్చల విడిగా ధాన్యం కొడంగల్‌కు రావడంతో మార్కెట్‌లో స్థలం పూర్తిగా నిండిపోయింది. వాస్తవానికి కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌ మండలాల్లో కలిపి రైతులు కేవలం 2,300 ఎకరాల పెసర పంటను సాగు చేశారు. ఈ ప్రాంతంలో ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా పండవు. అయితే ఈ విధంగా లెక్కలోకి తీసుకున్న కేవలం దాదాపు ఏడు వేల క్వింటాళ్లు పెసర ధాన్యం పండుతోంది. అయితే మార్కెట్‌యార్డు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4వేల బస్తాలనే తూకం వేశారు. మరో 10 వేలకుపైగా బస్తాలను తూకం వేయాల్సి ఉంది.కొడంగల్‌ మండలం అంగడిరాయిచూర్‌, రుద్రారం వంటి గ్రామాలకు చెందిన వ్యాపారులు ఒక్కొక్కరు 300 క్వింటాళ్ల వరకు ధాన్యం విక్రయించారు. ఈ వ్యాపారులకు మార్కెట్‌లో ఉండే అధికారులకు సంబంధాలు ఉండటంతో క్వింటాకు రూ.500 చొప్పున తీసుకుని దళారుల ధాన్యాన్ని ముందుగా తూకం వేయిస్తున్నారు. దీంతో నిజమైన రైతులు తమ వద్ద ఉన్న రెండు మూడు క్వింటాళ్ల అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిఘా పెట్టకపోవడంతో కర్ణాటక ధాన్యం ఇష్టానుసారంగా మార్కెట్‌కు తరలి వస్తోంది. కంది, పెసర ఉత్పత్తుల వరకు ఇదే పరిస్థితి నెలకొంది.కొడంగల్‌ ప్రాంతానికి చెందిన ఒక దళారి కంది ఉత్పత్తులను  తరలించి రూ.12 లక్షలు సంపాదించారు. కందులు, పెసర పంటలను రైతుల వద్ద తీసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతులకు ఇక్కడి అధికారులు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో రైతులు నిరాశ చెంది దళారులను అశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

Related Posts