
గూగుల్ మ్యాప్ తో స్కెచ్
హైద్రాబాద్,
పగటి పూట ఇళ్లల్లో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటి, బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 600గ్రాముల బంగారు ఆభరణాలు, 5కిలోల వెండి వస్తువులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.గూగుల్ మ్యాప్ సహాయంతో చోరీకి స్కెచ్ వేసే నిందితులు ఖరీదైన హోటళ్లలో బసచేస్తారు. సంపన్నులు ఉండే ప్రాంతాలపై రెక్కీ నిర్వహించి చోరీలు చేస్తారు. కార్ల నంబర్లకు కూడా ఏరాష్ట్రానికి వెళితే వాటినే బిగిస్తారు. అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తామని చెప్పి లోపలికి వెళ్లి చోరీలు చేస్తున్నారు. చోరీలు చేసేందుకు ప్రత్యేకంగా కొన్ని పనిముట్లు తయారు చేయించుకున్నారు. వాటి సాయంతో క్షణాల్లో దోపిడీ చేసి అక్కడి నుంచి పారిపోతారు. సంపన్నులు ఉండే ప్రాంతాల్లోనే చోరీలు చేస్తారు. కనీసం కిలో బంగారం తీసుకువెళ్తారు ఉత్తరప్రదేశ్, బూలంద్ శహర్ జిల్లా, బిబి నగర్ తాలూకా,నన్‌గలా గ్రామానికి చెందిన ఆదిత్య కుమార్ వ్యాపారం చేస్తున్నాడు, సహరాన్‌పూర్ జిల్లా, కొత్‌వాలిడెహత్‌కు చెందిన సురేంద్ర కుమార్ శర్మ, పోటకబుల్‌పూర్‌కు చెందిన పంకజ్ చౌదరి.
ఉత్తరాఖండ్, డెహరాడూన్ జిల్లా, రిషికేష్, గుమానివాలా కాలనీకి చెందిన మునిరాజ్ రాజౌరా అలియాస్ మునిరాజ్ రాజోలా నలుగురు కలిసి ముఠాగా ఏర్పాడి దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరు తెలంగాణ, ఎపి, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో చోరీలు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5, సంఘారెడ్డిలో1, కరీంనగర్‌లో 1, ఎపిలోని ఒంగోల్‌లో 1, తమిళనాడులో 1, మధ్యప్రదేశ్‌లో 1 చోరీ చేశారు. 2015నుంచి చోరీలు చేస్తున్నా ఇప్పటి వరకు ఈ ముఠా పోలీసులకు పట్టుబడలేదు. ఆదిత్య కుమార్ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తుండగా, పంకజ్ చౌదరి వ్యవసాయం చేస్తున్నాడు. సురేంద్ర కుమార్ శర్శ, మునిరాజ్ రాజౌర మెకానిక్, స్టాక్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. వీరు వారి గ్రామాల్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు.కిలోకు తక్కువగా బంగారం దొంగతనం చేయరు, కేవలం దొంగతనాన్ని 15నుంచి 20 నిమిషాల్లో పూర్తి చేయడం వీరి నైపుణ్యం. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో చోరీలు చేసి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోతారు వేరే రాష్ట్రానికి వెళ్లి అక్కడ చోరీలు చేస్తారు. ఏడాదికి ఒకసారి చోరీలకు బయలుదేరే ఈ ముఠా చోరీ చేసిన తర్వాత వారి రాష్ట్రానికి వెళ్లి సమానంగా పంచుకుంటారు. సైబరాబాద్ పరిధిలోని బాచుపల్లి, మాదాపూర్‌లో చోరీలు చేయడంతో అక్కడి సిసిటివిలు పరిశీలించిన ఎస్‌ఓటి పోలీసులు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారి గ్రామాల్లో అరెస్టు చేసి తీసుకువచ్చారు. పగటిపూట మాత్రమే వీరు చోరీలు చేస్తారు.. ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,00,000సిసి కెమెరాలు ఏర్పాటు చేయగా.. మాదాపూర్ డిసిపి పరిధిలో 50,000కెమెరాలు ఏర్పాటు చేశారు