YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో హూజూర్ గుబులు

టీఆర్‌ఎస్‌లో హూజూర్ గుబులు

టీఆర్‌ఎస్‌లో హూజూర్ గుబులు
నల్గొండ, 
హుజూర్‌‌నగర్‌ ఉపఎన్నిక టీఆర్‌ఎస్‌లో గుబులురేపుతోంది. పార్టీ నివేదికలు, సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమాత్రం ఆశాజనంగా లేదని తేలడంతో అధిష్టానం ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారట. అయితే, కేసీఆర్ రంగంలోకి దిగితేనే గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ లీడర్లు చెబుతున్నారు. హుజూర్‌నగర్‌లో ఎలాగైనా గులాబీ జెండా పాతాలన్న కృతనిశ్చయమంతో ముందుకెళ్తోన్న టీఆర్‌ఎస్‌కు స్థానిక సమీకరణాలు, పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్‌ను తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో మరింత ఫోకస్ పెట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట.పది రోజులుగా టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జులంతా హుజూర్‌నగర్‌లో మకాంవేసి, మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ, పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు రిపోర్టులు పంపిస్తున్నారు. అయితే, పార్టీ నేతలు నివేదికలు పంపిస్తున్నా, కేసీఆర్ మాత్రం ప్రైవేట్‌ సర్వేలు చేయించుకుంటూ, రోజువారీ రిపోర్టుల ఆధారంగా టీఆర్ఎస్‌ బలాన్ని అంచనా చేస్తున్నారు. అయితే, సర్వే రిపోర్టులు గులాబీ బాస్‌ను కలవరం పెట్టిస్తున్నాయట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా టీఆర్‌ఎస్‌కు మైనస్‌గా ఉన్నట్లు తేలిందట. దాంతో కాంగ్రెస్ కంచుకోటలను బద్దలుకొట్టడానికి కేసీఆర్‌ కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అభ్య,ర్ధి సైదిరెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉండటం హైకమాండ్‌కి తలనొప్పిగా మారిందంటున్నారు. కేసీఆర్‌తో రెండు మూడు సభలు నిర్వహిస్తేనే పరిస్థితి ఏమైనా మారొచ్చని, లేదంటే గడ్డు పరిస్థితేనని హుజూర్‌‌నగర్‌ టీఆర్‌ఎస్ లీడర్లు అంటున్నారు. మరో వైపు టీఆర్ఎస్ కు ఇండిపెండెంట్లు శత్రువులుగా మారననున్నారు. ఈవీఎంలలు కావడంతో గుర్తులు సరిగా కనపడవు. దీంతో టీఆర్ఎస్ గుర్తు అయిన కారు సింబల్ ను పోలిన గుర్తులు అనేకం గతంలో ఆ పార్టీని దెబ్బతీశాయి. హుజూర్ నగర్ లో కూడా పెద్దయెత్తున స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరికి కారు గుర్తు పోలిన సింబల్స్ వస్తాయన్న ఆందోళన తొలి నుంచి ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. తాజాగా హుజూర్ నగర్ లో 38 మంది అభ్యర్థుల వరకూ బరిలో నిలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలను పక్కన పెడితే మిగిలిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించాల్సి ఉంటుంది.ఇప్పుడు టీఆర్ఎస్ భయానికి అదే కారణమయింది. కారు గుర్తు పోలిన ట్రక్కు, ట్రాక్టర్, ఆటో వంటి గుర్తులతో గత ఎన్నికల్లోనూ అనేక మంది అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కీలక నేతలు కూడా ఈ గుర్తుల కారణంగా ఇంటి దారి పట్టారు. 88 స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ మరో పది స్థానాల్లో గుర్తుల కారణంగానే ఓటమి పాలయ్యామని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం విశ్లేషణలో తేల్చారు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కూడా గుర్తుల కారణంగానే ఓటమి పాలయ్యారని అప్పట్లో టీఆర్ఎస్ ప్రకటించింది.ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ గుర్తుల విషయం తీసుకెళ్లింది. ట్రాక్టర్, కెమెరా, ట్రక్కు, ఆటో గుర్తులను తెలంగాణ స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వరాదని ఎన్నికల కమిషన్ కోరింది. అయితే ఇప్పుడు దానిని టీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఫలితంగా ఈ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులు ఎంపిక చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలయింది. గుర్తుల కేటాయింపు జరగిపోవడంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ట్రక్కు లాంటి గుర్తుతో తమకు ఇబ్బందులు తప్పవని టీఆర్ఎస్ గ్రహించింది. దీనిపై పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. మరి ఈసారి కూడా గుర్తు టీఆర్ఎస్ కొంప ముంచుతుందేమోనన్న ఆందోళన మాత్రం ఆ పార్టీలో నెలకొని ఉంది.

Related Posts