YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బాబాయి దిగితే.... అంతా సెట్ రైటే 

బాబాయి దిగితే.... అంతా సెట్ రైటే 

బాబాయి దిగితే.... అంతా సెట్ రైటే 
తిరుపతి, 
వైవీసుబ్బారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా బాబాయి. ఆయన 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. కానీ అధికారంలోకి పార్టీ రాకపోవడంతో వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో కీలకంగా మారారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగడానికి వైవీ సుబ్బారెడ్డి కృషి చేశారు. అయితే తర్వాత రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఎంపిక అయి హస్తిన రాజకీయాలను చూసుకుంటుండటంతో ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డికి కొంత ప్రాధాన్యత అప్పట్లో తగ్గిందన్న వార్తలు వచ్చాయి.
2019 ఎన్నికలకు ముందు కూడా వైవీ సుబ్బారెడ్డి అతి పెద్ద జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇన్ ఛార్జిగా జగన్ నియమించారు. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులురెడ్డి చివరి నిమిషంలో వైసీపీలో చేరి ఒంగోలు పార్లమెంటు టిక్కెట్ కొట్టేశారు. దీంతో వైవీ సుబ్బారెడ్డిని జగన్ పక్కన పెట్టినట్లేనన్న వ్యాఖ్యానాలు విన్పించాయి. వైవీ కూడా ఎన్నికల సమయంలో ఒంగోలుకు, ప్రకాశం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తనకు సమీప బంధువైన ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో కూడా వైవీ సుబ్బారెడ్డికి విభేదాలుండటంతో ఆయన ప్రకాశం రాజకీయాలకు ఆ రెండు నెలలు దూరమయ్యారు.అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైవీ సుబ్బారెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో వైవీ సుబ్బారెడ్డి నిత్యం టచ్ లోనే ఉన్నారు. తోట త్రిమూర్తులు పార్టీలో చేరిక సమయంలో కొందరు నేతలు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినా వైవీ సుబ్బారెడ్డి వారికి నచ్చ జెప్పి తోట చేరికకు మార్గాన్ని సుగమమం చేశారు.ఇటీవల నెల్లూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వైరం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో ఇన్ ఛార్జి మంత్రి గా హోంమంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. వైసీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో జగన్ తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించారు. ఆయన ఇద్దరికీ నచ్చచెప్పగలిగారు.విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లావాసి అయినా జగన్ ఆ బాధ్యతను వైవీసుబ్బారెడ్డికే అప్పగించారు. ఇలా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉంటూనే వైసీపీలో కీలకంగా మారారు. జగన్ నోటి నుంచి వచ్చే మాటలు వైవీ నుంచి వస్తున్నాయన్న వ్యాఖ్యలు కూడా పార్టీలో విన్పిస్తున్నాయి. జగన్ తాను చెప్పదలచుకుంది వైవీ చేత చెప్పిస్తారన్నది పార్టీలో టాక్. ఎన్నికలకు ముందు డీలా పడిపోయిన వైవీ అధికారంలోకి రాగానే కీలకంగా మారారు.

Related Posts