YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బాధితుడికి ఆర్ధిక సహాయం అందించిన మంత్రి

బాధితుడికి ఆర్ధిక సహాయం అందించిన మంత్రి

బాధితుడికి ఆర్ధిక సహాయం అందించిన మంత్రి
హైదరాబాద్,
సినిమా బ్యానర్ కడుతూ విద్యుత్ఘానికి గురైన వ్యక్తికి రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అండగా నిలిచారు. మహబూబ్ నగర్ లోని తిరుమల సినిమా థియేటర్ లో సాహూ సినిమా విడుదల సందర్భంగా బ్యానర్ కడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్  కు గురై హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆపన్న హస్తం అందించారు మంత్రి. వెంకటేష్ కు మెరుగైన చికిత్స, మందుల కోసం అయన కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తన అనుచరులతో తెలుసుకొని సహాయం అందించారు. మంత్రి చొరవతో చిత్ర పంపిణీదారులు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో  మాట్లాడి వెంకటేష్ కుటుంబానికి రూ. 7 లక్షల సాయం ను అందించి ఆర్థికంగా తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ తల్లి నీలమ్మకు మంత్రి చేతుల మీదుగా చెక్కు ను అందించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సినిమా థియేటర్ యజమాని సురేష్ కుమార్ లు పాల్గొన్నారు.

Related Posts