YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ సమ్మెపై కేకే స్పందన

ఆర్టీసీ సమ్మెపై కేకే స్పందన

ఆర్టీసీ సమ్మెపై కేకే స్పందన
హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెరాస పార్లమెంటరీ పార్టీ నేత డా .కె .కేశవ రావు స్పందించారు. ఈ మేరకు అయన సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటన విడుదల చేసారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయి .ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపజాలదు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింప జేసి చర్చలకు సిద్ధం కావాలని అయన కోరారు. ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్ల ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతం లో గొప్పగా పరిష్కరించింది .44 శాతం ఫిట్ మెంట్ ,16 శాతం ఐ ఆర్ ఇచ్చిన ఘనత టీఆరెఎస్ ప్రభుత్వానిదే. "ఆర్టీసీ ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు ఇటీవలే తేల్చిచెప్పారు. అందుకు ఆయనను అభినందిస్తున్నా. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీ ల విషయం లో కెసిఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యం లో తీసుకున్న నిర్ణయం గా మాత్రమే చూడాలని అయన అన్నారు. నేను 2018 అసెంబ్లీ ఎన్నికల టిఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నాను .ఆర్టీసీ ని ప్రభుత్వం లో కలిపే ప్రతిపాదనేది మా ఎన్నికల ప్రణాళిక లో చేర్చలేదు. ఆర్టీసీ యే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని మేనిఫెస్టో లో పేర్కొన లేదని అయన స్పష్టం చేసారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే విధానాన్ని (పాలసీ )మార్చుకోవాలని కోరడమే .ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని అయన అన్నారు.

Related Posts