విశాఖ ఏజన్సీలో సినిమా షూటింగ్ సందడి
విశాఖపట్నం,
విశాఖ ఏజన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరు పట్టణంలో సినిమా చిత్రీకరణతో సందడి వాతావరణం నెలకొంది. జ్యోతిలక్ష్మీ మూవీ ప్రేమ్ సత్యదేవ హీరోగా, కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ దర్శకత్వంలో నిర్మాణం జరుగుతున్న పేరు పెట్టని మూవీ చిత్రీకరణ జరిపారు యూనిట్ సభ్యులు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు షాపింగ్ కాంప్లెక్స్ లో ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ కూడలి వద్ద పాటను రసవత్తరంగా చిత్రీకరించారు. అంబేద్కర్ సెంటర్ మూడు ప్రధాన రహదారులకు కూడలి కావడంతో వేలాదిమంది వీక్షకులను నృత్యం చిత్రీకరణ మంత్రముగ్ధులను చేసింది. దీనితో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ ఏజెన్సీలోని సుందర ప్రాంతాలైన డల్లాపల్లి, కొత్తపల్లి జలపాతం, లమ్మసింగి, అరకు, పెదబయలు మత్స్యగెడ్డ తదితర ప్రాంతాల్లో చిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ సభ్యులు ద్వారా తెలిసింది.