డిపోలముందు బీజేపీ ధర్నా
హైదరాబాద్
పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అన్ని అర్టీసీ డిపోల ముందు బీజేపీ శ్రేణులు నిరసన, ధర్నాలలో పాల్గొంటున్నారు. న్న ఆర్టీసీ ఉద్యోగస్తులు , కార్మికులకు అండగా నిలవాలనే పిలుపుమేరకు , మిథాని డిపోముందు ధర్నాకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు వంగా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్ సుఖ్ నగర్ డిస్ట్రిక్ మరియు సిటీ డిపోల వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు , ఉద్యోగులతో కలసి దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్ డిపోల ముందు నిరసన ర్యాలీలు చేపడుతు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల కు అన్నిరకాలుగా అండగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని , వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిశీలించి అమలు చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ధనిక రాష్ట్రాన్ని కాస్త దివాళా రాష్ట్రం గా మార్చారని , కార్పోరేట్ బడాబాబుల కు ఆర్టీసీ ఆస్తులను అంటగట్టాలని చూస్తున్నారని అయన ఆరోపించారు. ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కాకముందు ఒకలా, ముఖ్యమంత్రి అయ్యాక మరోలాగా ప్రతిరోజు వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలపై ప్రధాని దృష్టి వరకు తీసుకెళ్తామని , విజయం మనదే అని ఆయన కార్మికులకు , ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు.