YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉప ముఖ్యమంత్రిని కలిసిన వడ్డెర  మహిళలు

ఉప ముఖ్యమంత్రిని కలిసిన వడ్డెర  మహిళలు

ఉప ముఖ్యమంత్రిని కలిసిన వడ్డెర  మహిళలు
ఏలూరు,
ఏలూరు నగరంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో కార్యక్రమాలు  చేపడతామని వడ్డెర  పనివార్లకు ఉపాధి లభిస్తుందని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. స్థానిక మంత్రి కేంపు కార్యాలయంలో సోమవారం వడ్డెర మహిళలు నానిని కలిసి గత 15 రోజుల నుండి మున్సిపాలిటీలో కూలిపనులు లేక బాధపడుతున్నామని, ఎన్నో దశాబ్దాల నుండి తమ వడ్డెర కులస్ధులు మున్సిపాలిటీలో చేపట్టే పనులపై ఆధారపడి జీవిస్తున్నామని  నాని దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ పాలనలో పనులు చేయకుండా చేసినట్లు రికార్డులు చూసి కోట్లాది రూపాయలు దోచుకుతిన్నారని కార్పొరేషన్ లో విధులు లేకపోవడంతో పనులు  నిలిచిపోయాయని  త్వరలోనే ఏలూరు పాదయాత్ర చేస్తానని ప్రజా సమస్యలు  తెలుసుకుని రోడ్డు, డ్రైన్లు తదితర ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడికక్కడే పనులు మంజూరు   చేస్తానని దీనివల్ల వడ్డెర కార్మికులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ లోగా చిన్న చిన్న పనులు ఏమైనా వుంటే వడ్డెర కార్మికులకు అప్పగించాలని కమీషనర్ కు ఆదేశాలిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ  పాలనలో ప్రతి ఒక్కరికీ ఉపాధి సౌకర్యాలు కల్పించడానికి తగు చర్యులు  తీసుకుంటామని ముఖ్యంగా వడ్డెరకుల మహిళలు ఎంతో కష్టపడి  పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని వారికి తప్పకుండా ఉపాధి లభించేందుకు కృషి చేస్తానని  నాని చెప్పారు. వడ్డెర కులస్థుల ఆర్ధిక పురోభివృద్ధికి ప్రభుత్వపరంగా త్వరలోనే పెద్ద ఎత్తున ఋణసౌకర్యం  కల్పిస్తామని  తరతరాలుగా మట్టిని నమ్ముకుని  పనులు చేసే పరిస్థితి నుండి తమ  పిల్లలను చదివించి  ఉన్నతస్థాయికి ఎదగాలనే ఆలోచన పెంచుకోవాలని నాని మహిళలకు హితవు పలికారు.  పిల్లల చదువుభారం పేదలపై పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో  అమ్మవడి  పధకం క్రింద ప్రతి పేదకుటుంబానికి 15 వేల  రూపాయలు ఉచితంగా అందించి పేదకుటుంబాల పిల్లలు ఉన్నత చదువు  చదువుకోడానికి  ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. తరతరాలుగా  ఇదేపని చేస్తే ఎలా అని ఇప్పటికైనా   చైతన్య వంతులై తమ  పిల్లలను చదివించడానికి ముందుకు రావాలని  చిన్నారులను అంగన్ వాడీ స్కూల్స్ లో చదివించాలని  నాని చెప్పారు.అమ్మ వడి పథకం క్రింద ప్రతియోటా పేద కుటుంబాలకు 15 వేల రూపాయలు ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమాన్ని విజయవతం చేయాలని నాని కోరారు. స్వంత ఇళ్లలేని వడ్డెర కులస్ధులకు ఉగాధి నాటికి  ఇళ్లస్థలాలు  అందించి స్వంత ఇంటికలను సాకారం చేస్తామని చెప్పారు.

Related Posts