YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు ఘనస్వాగతం

చంద్రబాబుకు ఘనస్వాగతం

చంద్రబాబుకు ఘనస్వాగతం
నెల్లూరు  
ఏపీలో టిడిపి పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందుకోసం సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటనకు వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. నెల్లూరులో రెండు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సమీక్షలకు అయన హాజరవుతున్నారు.  గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జాతీయ రహదారి వద్ద భారీగా చేరుకొని చంద్రబాబుకు స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా క్రేన్ తో ఏర్పాటు చేసిన భారీ గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ చంద్రబాబు జిల్లాలో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు.

Related Posts