చంద్రబాబువి అసత్య ప్రచారం
తాడేపల్లి అక్టోబర్ 14,(న్యూస్ పల్స్)రైతుభరోసా ఒక చారిత్రాత్మక పధకం. చంద్రబాబు రైతురుణమాఫి పేరుతో రైతులను మోసం చేశారు. 2016లో వైయస్ జగన్ రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు. రేపటినుంచి ఆ పధకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు. రైతుకుటుంబాలలో వైయస్ జగన్ ఆనందం నింపబోతున్నారని ఎంఎల్ ఏ టిజేఆర్ సుధాకరబాబు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో రైతులు పూర్తిగా అన్యాయానికి గురయ్యారు. వైయస్ జగన్ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నవరత్నాలపధకం రాష్ట్ర్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇష్టవచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. టిడిపి నేతల్ని అడుగుతున్నా...మీ ఐదేళ్లపాలనలో శ్రీశైలం,నాగార్జునసాగర్ రిజర్యాయర్లు ఎన్నిసార్లు నిండింది ఎన్నిసార్లు గేట్లు ఎత్తారు. ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో లెక్కలు చెప్పండి.అదేమంటే అవాకులు చెవాకులు చెబుతారని అన్నారు. ఏపిలో తెలుగుదేశం పార్టీ పనిఅయిపోయింది. చంద్రబాబు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని టిడిపి నేతలే అంటున్నారు. చంద్రబాబుకు ఆల్జీమర్స్ వ్యాధి వచ్చిందని చెబుతున్నారు. లోకేష్ ఓటమిని చూసి చంద్రబాబు నిత్యం కుంగిపోతున్నారు. ప్రజలు గుణపాఠం చెప్పినా చంద్రబాబులో మార్పురాలేదు. తమ పని అయిపోతుందనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను బిజేపిలోకి చేర్చారని అన్నారు. చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ మటాష్ అవుతారు.ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్ జనసేన, బిజేపిలతో పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీలు మన రాష్ట్రంలో ఏమయ్యాయో అందరికి తెలుసని అయన అన్నారు. టిఆర్ ఎస్ తో గతంలో టిడిపి పొత్తుపెట్టుకుంటే ఆ సమయంలో ప్రజల తిరస్కారానికి గురైంది. అమ్మఒడి పధకం ఓ బృహత్తర కార్యక్రమం.ఎస్సీఎస్టీ కాలనీల్లో పిల్లలందరూ విద్యావంతులను చేయాలనే మంచి ప్రోగ్రామ్. చంద్రబాబు నీ పని పూర్తిగా అయిపోయింది.ఏ రోజు అయితే మంగళగిరిలో లోకేష్ ను గెలిపించుకోలేకపోయావో ఆరోజే నీ పని యిపోయింది.ఈ విషయం నీ పార్టీలోని పెద్దలందరికి తెలుసు. నీవు మేధావివి,పండితుడివి,అనుభవజ్ఞుడివి అయితే ఎందుకు లోకేష్ ఓడిపోయాడో,ఎందుకు టిడిపిని తిరస్కరించారో,ఎందుకు నిన్నువద్దనుకున్నారో, 23 సీట్లే వచ్చాయో విశ్లేషించుకునేవాడివి. పైగా బుకాయింపుమాటలు చెబుతావు.నీ పార్టీ సమావేశంలో నేను ఎందుకు ఓడిపోయానో అర్దం కావడం లేదని చెబుతావా అని ప్రశ్నించారు. రైతులను నీవు దారుణంగా మోసం చేస్తే నేడు రైతున్నలకోసం ఐదువేల కోట్ల రూపాయలతో రైతన్నలకు వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి నిధిని సంవత్సరం ముందుగానే ఆదుకుంటున్నారు..ఇక నీకు ఎక్కడ ఉంటుంది స్దానం. యువకులు రైతులు మహిళలు రైతుకూలీలలకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. అందుకనే నీకు భయం,అక్కసు,రివర్స్ టెండరింగ్ ద్వారా వేయికోట్ల రూపాయల ఆదా.అది నీవు ఒప్పుకోవని అన్నారు.