సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
వెంకటాచలం
కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటిలో ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈసందర్భంగా రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్కుమార్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ శేషగిరి బాబు, జాయింట్ కలెక్టర్ వినోద్కుమార్, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, గూడూరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వరప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం హోదాలో తొలి సారిగా జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఈ పర్యటను విజయవంతం చేసేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేస్తున్నామన్నారు. వారి వెంట నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ శీనా నాయక్, జడ్పీ సీఈవో బాపిరెడ్డి, వైసీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, మందల వెంకటశేషయ్య, పేర్నాటి శ్యాం ప్రసాద్రెడ్డి, రూప్కుమార్ యాదవ్, బిరుదవోలు శ్రీకాంత్రెడ్డి తదితరులున్నారు.
సీఎం సభలో వినూత్నమైన కార్యక్రమాలు : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న రైతు భరోసా బహిరంగ సభలో జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన వినూత్నమైన పలు కార్యక్రమాలను ప్రదర్శించడం జరుగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. సీఎం సభలో జగన్మోహన్రెడ్డి ముందు ప్రత్యక్ష పద్ధతిలో వరినాట్లు వేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఇందులో పాల్గొనేందుకు రైతులు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారన్నారు.