జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఆరంభంలోనే పోలీస్ లాఠీలు విరిగాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు అదుపు తప్పడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు భద్రతా సిబ్బంది చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొందరు కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు కూడా రువ్వినట్లు సమాచారం. నిర్వాహకుల లోపంతో ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కసారిగా మీడియా వాహనాలపైకి కార్యకర్తలు దూసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు భద్రతా సిబ్బందికి తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్యకర్తలను, నాయకులను పోలీసులు నిలువరించలేకపోయారు. దీంతో స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.