YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వ్యర్థాలతో ఎరువులను తయారు చేయడం ప్రతి ఒక్క నేర్చుకోవాలి

వ్యర్థాలతో ఎరువులను తయారు చేయడం ప్రతి ఒక్క నేర్చుకోవాలి

వ్యర్థాలతో ఎరువులను తయారు చేయడం ప్రతి ఒక్క నేర్చుకోవాలి
-  జెడ్ పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి,
 వనపర్తి
ఇంటి నుంచి వెలువడే వ్యర్ధాలతో ఎరువును తయారు చేయటం అందరు నేర్చుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి అన్నారు.  సోమవారం వనపర్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో  వ్యర్థాలతో ఇంటి ఎరువు ను తయారుచేసే కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఇండ్లలో నుండి చెత్తా చెదారం తో పాటు పండ్ల తొక్కలు, కుళ్లిపోయిన కూరగాయలు ఇవన్నీ వస్తాయని, వీటి ఆధారంగా ఎరువు తయారుచేస్తే పర్యావరణ పరిరక్షణ తోపాటు  పంటలకు ఉపయోగపడుతుందని, అందువల్ల జిల్లాలోని మహిళలందరూ వ్యర్ధాలతో ఎరువు ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని అన్నారు. ఈ విషయమై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, అందువల్ల మహిళలు దీనిపై దృష్టి కేంద్రీకరించి ఎరువు తయారు చేయాలని కోరారు.కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో ఎరువు తయారుచేయడం చాలా సులభమని, దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎరువు తయారీ పై ముందుగా పట్టణ మహిళ లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రాబోయే 20 రోజుల్లో జిల్లాలోని అన్ని అంగన్ వాడి కేంద్రాలు, పాఠశాలల్లో కూడా వ్యర్థ పదార్థాలతో ఎరువు తయారు చేయడంపై టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లు, వర్కర్లు వారి కేంద్రం నుంచి వచ్చే, ఆకుకూరల తొక్కలు, ఇతర వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం ప్రారంభించాలని, వీరి ఆధారంగా గ్రామంలోని మహిళలు కూడా వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం నేర్చుకుంటారని తెలిపారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నందున అనేక వ్యర్థ పదార్థాలు ఉంటాయని వాటి ద్వారా కూడా ఎరువు తయారు చేయవచ్చని, అందుకే వ్యర్ధాలతో ఎరువు తయారు చేయడంపై పాఠశాల లో టీచర్లకు అంగన్వాడి టీచర్లకు కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. పట్టణ ప్రాంత మహిళలతో పాటు, గ్రామీణ ప్రాంత మహిళలు కూడా ఇంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో ఎరువులు తయారు చేస్తే ఇంటి పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని, అంతేకాక ఎరువులు పండ్ల మొక్కలకు, పూల మొక్కలకు పంటలకు కూడా ఉపయోగపడతాయని ఆమె చెప్పారు. మహిళలు వ్యర్థ పదార్థాలతో ఎరువులు తయారు చేయడంపై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఈ విషయంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి నేర్చుకోవాలని చెప్పారు.  ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల ద్వారా ఎరువు తయారీ పై హైదరాబాద్ కు చెందిన అరుణ శేఖర్ మహిళలకు శిక్షణ ఇచ్చారు.  మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, డి ఆర్ డి ఓ గణేష్,  డి ఈ ఓ సుశీందర్  రావు, శ్రీరంగాపూర్, గోపాల్పేట, పెబ్బేరు జెడ్ పి టి సి లు రాజేంద్ర ప్రసాద్, భార్గవి, పద్మ తదితరులు హాజరయ్యారు.

Related Posts