154 పోలీసు అభ్యర్ధులు హజరు కాలేదు
మహబూబ్నగర్
పోలీసు శాఖలోని వివిధ పోస్టుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. పోలీసు ఉద్యోగానికి ఎంపిక అయినవారు గత వారం రోజులుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ కు వచ్చి అటేస్టేషన్ ఫారాలు అందించగా, ఎంపికైనవారిలో 154 మంది అభ్యర్థులు అటేస్టేషన్ ఫారాలు తీసుకోడానికే హాజరు కాలేదు. చట్టప్రకారం ఉద్యోగానికి ఎంపిక అయిన తర్వాత, సదరు వ్యక్తి ఉద్యోగంలో చేరటానికి ఇష్టం లేకపోతే, తనకు ఇష్టం లేని విషయాన్ని తెలుపుతూ వ్యక్తిగతంగా వచ్చి రాతపూర్వకంగా అధికారులకు అందజేయవలసి ఉంటుంది. అధికారికమైన ఆదేశాలుగా అభ్యర్థులు గమనించాలి. ఈ విషయంలో సందేహాలు ఉంటే 9440795701 లేదా 9985890808 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఇక ఇప్పటికే అటేస్టేషన్ ఫారాలు ఇచ్చిన అభ్యర్థులకు ఈనెల 16 వ తేదీ నుండి వైద్య పరీక్షలు ప్రారంభము కానున్నాయి. తేదీల వారీగా అభ్యర్థులకు సమాచారం ఇవ్వడమైనది. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీలలో ఉదయం ఏడు గంటలకు ఖచ్చితంగా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో హాజరు కావలసి ఉంటుంది. వైద్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు నాలుగు పాస్పోర్ట్ కలర్ ఫోటోలు, వైద్య పరీక్షలకు కావలసిన అధికారిక ఫీజు తీసుకురావలసి ఉంటుందని జిల్లా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కోంది.