YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్ట్రీట్ లైట్లకు మీటర్ బి గించడంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానం.

స్ట్రీట్ లైట్లకు మీటర్ బి గించడంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానం.

స్ట్రీట్ లైట్లకు మీటర్ బి గించడంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానం. 
జగిత్యాల  గ్రామాలలోని స్ట్రీట్ లైట్లను అన్నింటికి మీటర్ బిగించడంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ ఆన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళిక పై సోమవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాదులో జరిగిన సమావేశంలోని అంశాలపై అధికారులకు తెలుపుతూ ప్రతి గ్రామంలో ప్లాంటేషన్ , రెవెన్యూ ప్లాంటేషన్, వాటరింగ్, డంపింగ్ యార్డ్ ,వైకుంఠ దామం, నర్సరీ ప్రతి గ్రామంలో ఉండే విధంగా చూడాలని అన్నారు. మంకీ ఫుడ్ కోర్టు పనుల నిమిత్తము ఈజీఎస్ ఫాడ్ ను ఉపయోగించు  కోవాలని అన్నారు. గ్రామాలలో పిచ్చి మొక్కలను తొలగించాలని డ్రైనేజీ పరిశుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో గ్రామ సిబ్బందిని బట్టి ఎన్ని వార్డులు ఉన్నాయో ఒక్కొక్కరికి ఎన్ని వార్డులు వస్తాయో వాటిని విభజించి ఒక్కరికి ఎన్ని వాటిలో వచ్చును వార్డు గోడపైన సిబ్బంది యొక్క పేరు సెల్ నంబరు వ్రాయాలని అన్నారు. గ్రామాలలో ట్రాక్టర్ కొనుగోలు ట్యాంకరు, ఆయా గ్రామ పంచాయతీలకు చిన్నది, పెద్దది కావాల్సి ఉంటే గ్రామ సభలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఆమోదం పొంది ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. గ్రామపంచాయతీలలో విద్యుత్ బిల్లులను చెల్లించాలని, గ్రామాలలోని స్ట్రీట్ లైట్లను అన్నింటికి మీటర్ బిగించడంలో రాష్ట్రం లోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని అందుకు విద్యుత్ శాఖ అభినందించారు. గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం అయినట్లయితే వారిపై చర్యలు తప్పవని అన్నారు. గ్రామ పంచాయతీలలో వార్షిక ప్రణాళిక గ్రామ సభలో గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఆమోదం పొందిన పనులను మాత్రమే చేయాలని తెలిపారు. గ్రామాలలో కమ్యూనిటీ సో ఫీట్స్ గ్రామాల వారీగా ఎన్ని మంజూరు అయినవి, ఎన్ని పూర్తి అయినవి, ఎన్ని కావాలో వాటికి కావలసిన వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు.  గ్రామాలలో డస్ట్ బిన్ లు తడి చెత్త, పొడి చెత్తకు వాడు తున్నారా లేదా చూడాలన్నారు. గ్రామ జంక్షన్లో తడి, పొడి చెత్తకు వేరువేరుగా  చేయాలని, అన్ని గ్రామాలలో నర్సరీలు అటవీశాఖ వారితో కలిసి ఏర్పాటుచేసి గ్రామముకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నర్సరీలో తప్పకుండా కృష్ణ తులసి మొక్కలను పెంచాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో ఎల్ఇడి లైట్ లు పెట్టాలని అన్నారు. పాఠశాలల రిపేరు మరియు అదనపు తరగతుల గదులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 100 మంకీ పుట్టు కోట్లను విధిగా సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని ఫోటోలు కూడా తీసి పంపించాలని తెలిపారు. నాటిన మొక్కల దగ్గర రికార్డు లేని ఎడల రికార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామం మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఓ ఉన్నట్లయితే వేరే చోట స్థలం కేటాయించిన చొ అక్కడి నుండి మార్చగలరని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని
 సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వికలాంగుల శాఖ ద్వారా ట్రై సైకిల్ ఆలకుంట రాజమ్మ తండ్రి పేరు శ్రీనివాస్ మెట్ పెల్లి పట్టణంలోని సాయి నగర్ కాలనీ వారికి కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. రాజేశం, జడ్పీ సీఈవో, శ్రీనివాస్, డిఆర్ఓ అరుణ శ్రీ, ఆర్టీవో నరేందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related Posts