Highlights
ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి - జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి
పెద్దపల్లి,
ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గోని ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి (52 ) వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా చేసే విధంగా అవగాహన కార్యక్రామాలు నిర్వహించాలని, ప్లాస్టిక్ నిషేదానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, సింగల్ యూసేజ్ ప్లాస్టిక్ స్థానంలో క్లాత్ బ్యాగులను వినియోగించాలని ఆ దిశగా అవసరమైన కృషి చేయాలని అన్నారు. కలెక్టరేట్ ఎఒ రాజేశ్వర్ రావు, జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు