YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అనుమానస్పదం గా రెండు ఏనుగులు మృతి

అనుమానస్పదం గా రెండు ఏనుగులు మృతి

అనుమానస్పదం గా రెండు ఏనుగులు మృతి
చిత్తూరు 
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం లో అనుమానస్పదం గా రెండు ఏనుగులు మృతి చెందాయి. విద్యుత్ షాక్ తో అవి మృతి చెందినట్లు అధికారులు  అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కళేబరాలను  గుంత తవ్వి పూడ్చి పెట్టినట్లు సమాచారం. మండలం లోని కొనగుంట హరిజన వాడ (తుమ్మల పల్లి) సమీపం లోని  పంట పొలాల్లో రెండు ఏనుగులను గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన తరువాత పూడ్చి పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారులకు ఈ విషయం ఆలస్యంగా రావడంతో విచారణ చేస్తున్నారు.  అధికారులు చెబుతున్న సమాచారం బట్టి ఆ మధ్యకాలంలో పలమనేరు అటవీ ప్రాంతం నుంచి  మూడు ఏనుగులు తవణంపల్లి మీదుగా ఐరాల మండలం, డివిటివారిపల్లి, బెస్తపల్లి హంద్రీ నీవా కాలువ మీదుగా చెంగనపల్లి గ్రామాల మీదుగా కొత్తూరు కు సమీప ప్రాంతంలలోకి వచ్చాయి..  ఆ తరువాత వాటి సంచారం లేదు. ఏనుగులు ఏమైయ్యాయని అప్పటి నుండి ఆరా తీస్థు వస్తూన్నపారెస్ట్ అదికారులకు నిన్న మైండ్ బ్లాక్ అయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల సమాచారం మేరకు అడవి పందుల నుంచి పంటలను కాపాడు కునేందుకు  రక్షణ గా ఏర్పాటు చేసుకున్న విద్యుత్  కంచె  తగిలి అవి మృతి చెంది ఉంటాయని పేర్కొంటున్నారు.  వాటిని ఎవరు పూర్చిపెట్డారనేది మిస్టరీ గా ఉంది. ఆ దిశగా పోలీసులు,  ఫారెస్ట్ అధికారులు విచారణ జరుపుతున్నారు..  అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయి లో పంచనామా నిర్వహించారు. అయితే ఏనుగులు మృతి చెంది 20 రోజులు పై న ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. 

Related Posts