YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సిద్ధప్పకు హై కమాండ్ వార్నింగ్

సిద్ధప్పకు హై కమాండ్ వార్నింగ్

సిద్ధప్పకు హై కమాండ్ వార్నింగ్
బెంగళూర్, 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇక వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇన్నాళ్లూ శాసనసభలో ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నించిన ఆయన ఇక దానిని కాపాడుకోవాల్సి ఉంది. సిద్ధరామయ్య పై కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత బాగానే ఉంది. బయటకు చెప్పకపోయినా సిద్ధరామయ్య అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు సీనియర్ నేతలు హైకమాండ్ కు చేరవేస్తున్నారు. ముఖ్యంగా జనతాదళ్ ఎస్ నేతలతో వైరాన్ని కొని తెచ్చుకోవడాన్ని కూడా కొందరు నేతలు తప్పుపడుతున్నారు.అయితే శాననసభలో ఎక్కువ మంది సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిద్ధరామయ్యను ప్రతిపక్ష నేత హోదాను అధిష్టానం కట్టబెట్టింది. అయితే వార్నింగ్ ఇచ్చి మరీ ఆ పదవి ఇచ్చిందంటున్నారు. అందరినీ కలుపుకోకుండా వెళితే భవిష్యత్తులో పదవి ఉండదని కూడా హైకమాండ్ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్యపై నేటికీ కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగడాన్ని కూడా హైకమాండ్ సీరియస్ గా భావిస్తుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంపై సిద్ధరామయ్య పెద్దగా స్పందించకపోవడాన్ని కూడా కొందరు నేతలు తప్పు పడుతున్నారు. తనను వ్యతిరేకించిన పరమేశ్వర చిక్కుల్లో పడినా సిద్ధరామయ్య లైట్ గా తీసుకున్నారన్న వ్యాఖ్యలు కూడా పార్టీలో విన్పిస్తున్నాయి.
కానీ అధిష్టానం హెచ్చరికలతో సిద్ధరామయ్య కొంత మేర దిగివస్తున్నారు. తనకు శత్రువులుగా భావించిన నేతలను కూడా కలుపుకుని పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నికలు తన సారథ్యంలోనే జరగనున్నాయని సిద్ధరామయ్యకు తెలుసు. ఈ ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలిగితే తిరిగి పార్టీలో తనదే పై చేయి అవుతుందని సిద్ధరామయ్య భావిస్తున్నారు. అందుకోసమే అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నాలు సిద్ధరామయ్య ప్రయత్నించారు

Related Posts