YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కొడుకువైపే చిరు మొగ్గు

కొడుకువైపే చిరు మొగ్గు

కొడుకువైపే చిరు మొగ్గు
హైద్రాబాద్,
మెగాస్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. చిరంజీవి రాజకీయాల్లో ప్లాప్ అయ్యారు. పవన్ కల్యాణ్ అట్టర్ ప్లాప్ అయ్యారన్నది మెగా కాంపౌండ్ అభిప్రాయం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వచ్చిన స్పందన, చేరిన నేతలు జనసేన పెట్టినప్పుడు లేదు. చిరంజీవి ఒక దశలో పవన్ కల్యాణ్ ను పార్టీ పెట్టవద్దని వారించారన్నది కూడా టాక్. అయితే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తెస్తానన్న నమ్మకంతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకున్నారు.గత ఎన్నికల్లోనూ చిరంజీవి జనసేన పార్టీకి మద్దతు పలకలేదు. సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినా చిరంజీవి పవన్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనలేదు. కనీసం నాగబాబు పోటీ చేసిన నర్సాపురం, పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లోనూ చిరంజీవి ప్రచారం చేయలేదు. అసలు చిరంజీవికి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడమే ఇష్టంలేదంటారు. పవన్ కల్యాణ్ కు చెప్పినా తన మాట పోతుందని భావించి చిరంజీవి మౌనం వహించాడంటారు. ఇలా మెగా కాంపౌండ్ రాజకీయంగా పవన్ కు పెద్దగా సపోర్టు చేయడం లేదు.తాజాగా చిరంజీవి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడం కూడా పవన్ కల్యాణ్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. ఒకవైపు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి జగన్ ను పవన్ కల్యాణ్ ఢీకొట్టాల్సి ఉంటుంది. దీంతో పవన్ కల్యాణ్ పార్టీని పటిష్టపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది అని చెప్పాలంటే అది మెగా అభిమానులే. పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులందరూ జనసేన వైపు మొగ్గు చూపుతారు.కానీ జగన్ ను చిరంజీవి కలవడంతో మెగా ఫ్యాన్స్ లో కొంత అయోమయం నెలకొంటుందన్నది వాస్తవం. అన్నయ్య జగన్ వద్దకు వెళ్లడాన్ని ఇప్పటికీ కొందరు మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సైరా సినిమాకు ఎక్స్ ట్రా షోలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా చిరు భేటీ కారణం కావచ్చు. అలాగే మంత్రి కన్నబాబు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా అదనపు షోలకు అనుమతి ఇప్పించడంలో కృషి చేశారు. పవన్ కల్యాణ్ కన్నబాబును ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగతంగా దూషించారు. అయితే ఇటీవల చిరంజీవి కన్నబాబు సోదరుడు మరణంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఇలా మెగా స్టార్ చిరంజీవి రాజకీయంగా తమ్ముడి విషయంలో కొంత ఎడం పాటిస్తున్నట్లే అర్థమవుతుంది.

Related Posts