YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మరో పాకిస్థాన్ కానున్న హైదరాబాద్..?

Highlights

  • నిజాం పాలనను తలపిస్తున్న గులాబీబాస్ 
మరో పాకిస్థాన్ కానున్న హైదరాబాద్..?

నిజాం పాలనను తలపించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలన ఉందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   నియంతలా వ్యవహరిస్తూ  ప్రతిపక్షాలను అణచివేసేందుకు  ప్రయత్నిస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయడాన్ని చీకటి రోజుగా పరిగణిస్తున్నారు. కాగా ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు, నిరసనలు నిషేధించారు. నిరసనకారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలుపాలని హుకుం జారీ చేశారు. కాంగ్రెస్  లేని వాటిని ఊహించుకుని తాము ప్రజాస్వామ్యబద్ధంగా లేమని ఎద్దేవా చేశారు. 1956 సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కాలరాసి ఏపీలో తెలంగాణను కలిపింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూయేనని ఆరోపించారు. ఆనాటి నెహ్రూ నిర్ణయానికి తలలూపిన కాంగ్రెస్ నేతలు అంగీకరించారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి పదవులు ఇవ్వగానే చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం ఊసే ఎత్తలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ రాష్ట్రం గురించి కాకుండా వారి పదవుల కోసమే పాకులాడారని గులాబీ బాస్  ఆరోపించారు. మరో పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన కూడా కేసీఆర్ ధ్వజమెత్తారు.  ఇవ్వన్నీస్తుంటుంటే..హైదరాబాద్ మరో పాకిస్తాన్ కాబోతుందా.. అన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుందా అన్న అనుమానాలు కలుగకమానవు. ఈ  సందర్భంలో ఒక సారి చరిత్రను పునరావృతం చేసుకుంద్దాం..


సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వివాదంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇది వివాదంగానే ఉంది. నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనమైన రోజు అది. నిజాం అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోవడంతో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో భాగమైంది. ఓ వైపు దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటుంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగానే ఉంది. ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో ద్వారా దాన్ని తనలో అంతర్భాగం చేసుకుంది.ఇండియన్ యూనియన్ సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది.
అసలేం జరిగిందంటే..
1946 - 1948ల మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి రంగంలోకి దిగడం దానివల్లనే జరిగింది. నిజాం లొంగిపోయిన తర్వాత 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి అనే సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించి, నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. అయితే,
నిజాం చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది.

1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది.1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ చేతుల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తన ప్రభుత్వం రాజీనామా ఇచ్చిందని, ఆ పని ఇది వరకే చేయాల్సిందని, అలా చేయనందుకు విచారిస్తున్నానని, యుద్ధం నుంచి సైన్యాన్ని విరమించుకుంటున్నానని, ఐక్యరాజ్య సమితిలలో పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. నిజాం చివరి ప్రధాని... హైదరాబాద్ చివరి నిజాం ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ ఈయనే. నిజాం ప్రభుత్వానికి మద్దతుగా దౌత్యపరమైన అనేక చర్యలను ఈయన చేపట్టారు.


 సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. కానీ, మజ్లీస్ దాన్ని వ్యతిరేకిస్తోంది. ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బ తింటాయనే భావనతో ప్రభుత్వాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలోనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గానీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా పరిగణించి సంబరాలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు అతివాద కమ్యూనిస్టులు అసలు విమోచన, విముక్తి అనే పదాలనే వ్యతిరేకిస్తున్నారు.

Related Posts