|
||
తంత్రసాధన |
తంత్రాలన్నీ శివప్రోక్తాలే. శివుడికి పంచామ్నాయాలూ పంచముఖాలు.
౧. శివుడి యొక్క సద్యోజాతమనే ముఖం నుంచి పూర్వామ్నాయం ఉద్భవించింది.
౨. వామదేవమనే ముఖం నుంచి దక్షిణామ్నాయం ప్రకాశితమైంది.
౩. అఘోరమనే ముఖం నుంచి పశ్చిమామ్నాయం జనించింది.
౪. తత్పురుషమనే ముఖం నుంచి ఉత్తరామ్నాయం ప్రకటమైంది.
౫. ఈశానమనే ముఖం నుంచి ఊర్ధ్వామ్నాయం వెలువడింది. దీన్నే వైదికమార్గం అంటున్నారు.
తంత్రసాధన పశ్చిమామ్నాయ సంప్రదాయానికి చెందినది. రథక్రాంత, విష్ణుక్రాంత, అశ్వక్రాంత అనే భేదాల వల్ల తంత్రం మూడువిధాలని చెప్పబడింది. వేద, ఇతిహాసాల కాలంలో లేని తంత్రసాధన ఆ తరువాతి యుగాల్లో భారతదేశంలో విస్తారంగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణాల్ని రకరకాలుగా చెప్పడం జరిగినది. తంత్రసాధనకు కుల-మత -లింగ-వర్గ విచక్షణ లేకపోవడం ఒక ప్రధాన కారణం. తంత్రోపాసకులంతా ఒకే కులం కింద ఉన్నట్లుగా చెప్పబడినది. అలాగే వారు చేయాల్సిన సంధ్యోపాసన బ్రాహ్మణుల సంధ్యోపాసన కంటే చాలా తేడాగా ఉంటుంది. అలాగే వారి హోమపద్ధతీ, మంత్రాలూ, నైవేద్యాలూ అన్నీ తేడాగానే ఉంటాయి. తంత్రాలు దేని గుఱించి ? అనడిగితే “ఇహానికీ, పరానికీ కూడా” అని తంత్రోపాసకులు సెలవిస్తారు. తంత్రమంటే శాస్త్రం కాదు. ఆచరణ కర్మలు ఏ విధంగా చెయ్యాలో నిర్దేశిస్తుంది బోధన చెయ్యదు. ప్రయోగం చేయుటవల్లనే ఫలితం అర్థమౌతుంది తప్ప పఠనంవల్ల, వినడంవల్ల తంత్రము రాదు. ప్రతియొక్క మతమందు తంత్రవిధానముంటుంది. తంత్రవిధానం విధానంలో తేడాతప్ప తంత్రం లేకుండా ప్రపంచంలో ఏ మతకార్యముకాని, దైవిక కార్యకలాపంకాని ఉండదు. శివుడు కైలాస పర్వతమునందు పార్వతికి ఉపదేశించినట్ల చెప్పబడింది తంత్రశాస్త్రము. అతిరహస్యమైనదని, గోప్యమైనదని చెప్పబడుటవల్ల అనాదిగ గోప్యంగా ఉంచబడుటవల్ల ప్రజల్లో అనేకానేక భయాలు, సందేహాలు చోటు చేసుకున్నాయి. తంత్రానికి మతంతో సంబంధముండదు. ఎవరే మతం పుచ్చుకొన్నా తంత్రము సాధనతో కూడుకొన్నది. తంత్రాన్ని అర్థంచేసుకొనుటకు ప్రయత్నించడమన్నది వ్యర్థ ప్రయాస, తంత్రాన్ని సాధన చెయ్యాలి. జాతి, వర్ణ ప్రాంత, మత సంబంధాల కతీతమైనది మంత్రశాస్త్రము. సాధన ఒక్కటే దాని పరమగమ్యం తంత్రం ద్వారా ప్రాకృతిక శక్తులను మనకనుగుణంగా మార్చుకొనుటవల్ల, మనకు కావలసిన పనులు చేసుకోవచ్చును. నీటిని ఏ విధంగా త్రాగుటకు, కరెంటు తయారుచేయుటకు, వ్యవసాయానికి, అభిషేకానికి వాడుకొంటామో ఆ విధంగానే తంత్రాన్ని వాడుకోవాలి. భైరవాది ప్రయోగ తంత్రములో అనేకం భైరవ ప్రయోగాలు దాగి ఉంటాయి. వాటిల్లోవుండే మంత్రములు మంచి చేసే వారికి సహాయము శతృవులను పలాయనం చేయించే మంత్రములు వున్నవి. వాటిని సాదన చెయదలచిన వారికి అన్నీ తంత్రములు కాక కొన్నైనా అవపోసన పట్టాలి అంటే గురువు చాలా అవస్యము. తంత్ర విద్యలు ఏది కావలని సంకల్పంచేసి సాదన చేసిన వారికి తప్పక సిద్దిoచును. కనుక తంత్రముతో ధర్మ అర్ద కామ మోక్షములు అనే నాలుగు సాధకునలకు అతి త్వరగా సిద్ధించుట జరుగునని గుర్తించగలరు తంత్ర సాధనలో సాధకులకు తెగింపు చాలా అవసరం. తంత్ర సాధన చాలా కష్టము అని గుర్తించగలరు. చెడుకు ఇది ఉపకరించదు....