YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మెదక్ జిల్లాను  వేధిస్తున్న నీటి సమస్య

మెదక్ జిల్లాను  వేధిస్తున్న నీటి సమస్య

మెదక్ జిల్లాను  వేధిస్తున్న నీటి సమస్య
మెదక్, 
మెదక్ జిల్లా  వాసులను   తాగు నీటి  సమస్య  వెంటాడుతోంది. భారీ వర్షాలతో  రాష్ట్రంలోని  ప్రాజెక్టులు  జలకళను  సంతరించుకున్నా.. సింగూరు  ప్రాజెక్టు  మాత్రం   నీరులేక  వెలవెలబోతోంది. రాష్ట్ర వ్యప్తంగా భారీ వర్షాలు కురిసి.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కానీ మెదక్ జిల్లాలో తాగునిటికి జనం ఇబ్బందులు పడుతునే ఉన్నారు. రామాయంపేట మున్సిపాలిటిలో  తాగునీటి కోసం మహిళలు  చాలా సార్లు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో  రోడ్లపైకొచ్చి రాస్తారోకో నిర్వహించారు. రెండేళ్లగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండా కాలం, వానా కాలం అని తేడా లెకుండా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రామాయంపేట వాసులు.  బీసి,ఎస్సి కాలనీల్లో మిషన్ భగీరథ నీరు కూడా రాకపోవడంతో.. వ్యవసాయ బోర్ల దగ్గర నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో  మిషన్ భగీరథ  ప్రాజెక్టులు  కూడా  బోసి పోతున్నాయి. దీంతో వర్షాకాలంలోనూ   తాగునీటి  సమస్య ఏర్పడింది.  వరుసగా రెండేళ్లు సరైన వర్షాలు కురవలేదు. దీంతో ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటింది. దిగువన పరీవాహక ప్రాంతంలోనూ సమృద్ధిగా వానలు కురవలేదు. దీంతో ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. నాలుగు దశాబ్దాలలో ఇలాంటి పరిస్థితి  ఎప్పుడూ రాలేదు. వర్షాకాలం ముగుస్తున్నా ప్రాజెక్టులో కొత్త నీరు చేరలేదు. ప్రస్తుతం ఎగువన మంజీర పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో  స్వల్పంగా వరద చేరుతోంది.సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు.. 2013-14లో ప్రాజెక్టులో నీరు ఒక టీఎంసీకి పడిపోగా, జూన్ లో కురిసిన వానలకు కొత్తనీరు చేరింది. గతేడాది జూన్ లో రెండు టీఎంసీల నీరు కొత్తగా వచ్చి చేరింది. అదే విధంగా ఈ ఏడాది కూడా వస్తుందని భావించినా.. రెండు నెలల్లో కేవలం 0.21 టీఎంసీ మాత్రమే వచ్చింది. పరీవాహక ప్రాంతంలో, ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో ఉన్న నీరు రోజురోజుకు ఆవిరైపోతోంది. గతేడాది జూన్ -జులైలో నాలుగు టీఎంసీల కొత్త నీరు చేరడంతో.. కాస్త ఊపిరి పీల్చుకున్నారు నీటి పారుదల శాఖ అధికారులు. ఈ ఏడాది ఇప్పటి వరకు కనీసం ఒక టీఎంసీ చేరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Related Posts