YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంచి సమయం..

Highlights

  • శ్రీరస్తు..శుభమస్తు
  • తేదీ : 15-03-2018, గురువారం. 
మంచి సమయం..

ముఖ్యమైన పనులు చేయడానికి అనుకూల ముహూర్త సమయాలు

మంచి సమయం..
ఉ.11.25 - 1.40 గం.ల వరకు.,
సా. 6.35 - రా. 9.10 గం.ల వరకు.
  
ఫల్గుణ బహుళ , త్రయోదశి సా. 5 .19 గం.ల వరకు.
ధనిష్ట నక్షత్రం సా. 5 .12 గం.ల వలకు

 

ఏదైనా మంచి కార్యం జరగాలన్నా, ఒక చెడ్డ కార్యం జరగాలన్నా వెనక ఒక యంత్రాంగం అనేది ఉండాలి. మంచి కలగాలి అంటే ఒక పెద్ద యంత్రాంగం కావాలి, కానీ పాడు చేయడానికి చిన్న మంత్రాంగం చాలు.

దశరథ మహారాజు శ్రీరాముని పట్టాభిషేకానికి ఎక్కువ సమయం ఇస్తే ఏక్కడినుండైనా ఆటంకం వచ్చి పడుతుందేమోనని ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా రేపు పుష్యమి నక్షత్రం రోజు బాగుంది అని వెంటనే ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. రాముడి అంగీకారం కూడా అడగలేదు. అప్పుడు రామచంద్రుడికి కబురు చేసి సభలోకి పిలిచాడు. నేను కాదు నీవు రాజువి కావాలని కోరుకొనేది, ఈ పుడమి తల్లి కోరుకుంటుంది అని చెప్పాడు. రేపే పట్టాభిషేకం అని చెప్పాడు, చేయాల్సిన వైదికమైన కార్యక్రమాలు అచరించమని చెప్పాడు. సభ అయ్యాక తన మందిరానికి వెళ్ళి మళ్ళీ వెంటనే రామచంద్రుడిని పిలిపించాడు. తనకు పాడు కలలు వస్తున్నాయి, నేను గమనించే ఉత్పాతాలని చూస్తే నాకు క్షేమం కాదు అని తెలుస్తుంది, అందుకే వెంటనే నీ పట్టాభిషేకం ఏర్పాటుచేసాను, నీ తమ్ముడైన భరతుడు ప్రక్కన లేడు అని భాద పడకు అని చెప్పాడు. భరతుడు తన మేన మామ వద్ద ఉన్నాడు, ఎందుకో తెలియదు కానీ దశరథుడు అందరికి కబురు చేసాడు ఒక ఆ రాజ్యానికి తప్ప. ఆయనలో ఏదో సంకోచం ఉన్నట్లుంది. అట్లా ముందే అన్ని రక్షణ ఉపాయాలన్ని ఆలోచించినా, ఎదురు చూడని ఒక మూలనుండి ఒక పెద్ద ఉత్పాతం వచ్చిపడింది.

అసలు కైకమ్మ చాలా మంచిది. చక్కటి మనస్సు ఉంది, రాముడిపై చాలా ప్రేమ ఉంది. రాముడు తన తల్లి కౌసల్యమ్మ వద్ద కంటే కైకమ్మ వద్దే ఎక్కువ ప్రేమ చూపేవాడు. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అంటే ఆనందించింది మొదట కైకమ్మనే. ఆమె దాసి చిన్న మంత్రాంగం నడిపి మొత్తం తలక్రిందులు చేసేసింది. *"జ్ఞాతి దాసి ఎతో జాత"* అంటాడు వాల్మీకి. అయోధ్యలో పుట్టినవారు ఎవ్వరూ పొరపాటున కూడా రామున్ని కష్ట పెట్టాలని అనుకోనే అనుకోరు. అందుకే ఆ మంథర *"ఎతో జాత"* ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎలా పుట్టిందో తెలియదు అని అంటాడు. ఆమె కైకమ్మ పుట్టిన చోటి నుండే వచ్చింది, అంతవరకు తెలుసు. అట్లాంటి ఆలోచన చేయడమే కష్టం, అంతే కాదు కైకమ్మ మనస్సులోకి ఎంతో గాడంగా ఎక్కించింది.

Related Posts