YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

విష పానియం తాగి చిన్నారి మృతి

విష పానియం తాగి చిన్నారి మృతి

విష పానియం తాగి చిన్నారి మృతి
మంచిర్యాల అక్టోబరు 15, (న్యూస్ పల్స్)మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరిక పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ ఇద్దరు చిన్నారులు తాగిన మజా బాటిల్  ప్రాణాల  మీదకు తెచ్చింది. గ్రామానికి చెందిన బానోతు తిరుపతి రజిత దంపతులు ఇద్దరు పిల్లలను తీసుకొని పొలంకు వెళ్ళారు. అక్కడే ఉన్న మజా బాటిల్ ను చూసి పిల్లలు తాగారు వెంటనే అస్వస్థతకు గురైన పిల్లలు ఐశ్వర్య(6),శివరాం నాయక్ (4) లను అను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు ఆపైన కరీంనగర్ కు తరలించే క్రమంలో శివ రామ్ నాయక్ మృతి చెందాడు. ఐశ్వర్య కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి శివ రామ్ నాయక్ శవ పరీక్ష నిర్వహించి మృతికి గల కారణాలు విచారించి కేసు నమోదు చేశారు. పిల్లలు తాగిన మజా బాటిల్ లో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విషం కలిపినట్టుగ అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రీ తిరుపతి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

Related Posts