గ్రేటర్ పరిధిలో విజయ ఉత్పత్తుల దుకాణాలు
హైదరాబాద్
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీయే పరిధిలో 500 విజయ ఉత్పత్తుల ఔట్ లెట్ ల ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బేగంపేట లోని హరిత ప్లాజా లో విజయ డైరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ భేటీలో కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, చైర్మన్ లోక భూమా రెడ్డి, సంస్థ ఎండీ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గోన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైవే ల వెంట విజయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు, ప్రయివేటు డైరీ ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా విజయ డైరీ ఉత్పత్తుల ధరలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల లో విజయ డైరీ ఉత్పత్తులు వినియోగించే లా ఆదేశాలు ఇచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, అన్ని దేవాలయాలలో విజయ నెయ్యి ఉపయోగించే లా చర్యలు, రానున్న సమ్మక్క సారక్క జాతరలో 150 సంచార వాహనాల ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు, విక్రయాలు మరింత పెంచడానికి థియేటర్ లు, టీవీలు , సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం, విజయ ఉత్పత్తులు తెలిసేలా హోర్డింగ్స్ ను హైవే లు, పర్యాటక ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.