YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

పోచంపల్లి ప్రాథమిక హాస్పిటల్లో డాక్టర్ల కొరత

పోచంపల్లి ప్రాథమిక హాస్పిటల్లో డాక్టర్ల కొరత

పోచంపల్లి ప్రాథమిక హాస్పిటల్లో డాక్టర్ల కొరత
భూదాన్ పోచంపల్లి (యాదాద్రి) 
పోచంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక హాస్పిటల్లో డాక్టర్ల కొరత వల్ల రోగులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు ఉంటారు కానీ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం ఒకే ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ హర్ష రెడ్డి  ఒక్కరే ఉండటం వల్ల పోచంపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల ప్రజలు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నారు. డాక్టర్ హర్ష రెడ్డి  మాట్లాడుతూ ప్రతి రోజు 2 వందల నుంచి 3 వందల మంది రోగుల వస్తున్నారని ఒకే ఒక డాక్టర్ వల్ల కావడం లేదని మరొక డాక్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తక్షణమే మరో డాక్టర్ను వెంటనే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు అలాగే డిప్యూటేషన్ మీద రెండు సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రావడంలేదని అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని అతని స్థానంలో మరొకరిని ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయం అన్నారు. తక్షణమే మరో డాక్టర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మరొక స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు మాత్రం పోచంపల్లి ప్రాథమిక హాస్పిటల్ పట్టించుకునే వారే లేకపోయార అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పూర్తి స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని ప్రజలకు సేవ వినియోగించే విధంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు.

Related Posts