పదకొండవ భారత రాష్ట్రపతికి ఘనంగా జన్మదిన వేడుకలు
పేపర్ బాయ్ స్థాయి నుంచి పైలెట్ తయారు చేసే స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం
బేతంచర్ల,
బేతంచర్ల పట్టణంలోని సుమేధా ఆంగ్ల పాఠశాలలో మంగళవారం నాడు భారత దేశానికి 11వ రాష్ట్రపతి అయినా ఏపీజే అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కోఆర్డినేటర్ మహేశ్వరి, దస్తగిరి లు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గురించి వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం పూర్తి పేరు ఆవుల జైనులబ్దీన్ కలాం అని ఈయన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం లో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించాడని ఈయన తండ్రి జైనులాబ్దిన్ ఈయన పడవ నడిపేవాడని ఈయన తల్లి గృహిణి అని ఈయన తండ్రికి తోడ్పాటును అందించడానికి ఉదయాన్నే న్యూస్ పేపర్ ను పనిచేసేవారని పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారని ఎక్కువ సమయం కష్టపడే వారిని మెట్రికులేషన్ తన పాఠశాలలో పూర్తి చేశాక కలాం సెయింట్ జోసెఫ్ కళాశాలలో తిరుచ్చి రాపల్లి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు అని అప్పట్లో కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది అని అతనికి కోర్సు పూర్తి అయ్యాక మక్కువ కలిగిన కలగలేదని నాలుగు సంవత్సరాల కోర్సు చదివిన తర్వాత చింతించారు 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారు ఈయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టా పొంది 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డి . ఆర్ . డి . ఓ యొక్క ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేరి యొక్క మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం ప్రయోగానికి డైరెక్టర్గా పనిచేసి జులై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర విజయవంతంగా చేరింది ఈయన ఇస్రో లో పనిచేయడం తన జీవితంలో అతి పెద్ద విజయం లో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. అని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు తెలియజేషారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పుల్లంరాజు, సరస్వతి , సత్యనారాయణ, పాఠశాల కరస్పాండెంట్ విజయ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.