YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అనంతలో తాగు, సాగు నీటి కష్టాలు

అనంతలో తాగు, సాగు నీటి కష్టాలు

అనంతలో తాగు, సాగు నీటి కష్టాలు
అనంతపురం, 
హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని ఆశించిన రైతులు, ప్రజల ఆశాలు అడియాశలవుతున్నాయి.
హంద్రీనీవా కృష్ణాజలాలతో దాదాపు 3.50 లక్షల ఎకరాల సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా జిల్లాకు దాదాపు 40 టీఎంసీల నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే నియోజకవర్గానికి మాత్రం సాగునీటి కేటాయింపులు అధికారికంగా ప్రకటించకపోడంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.హంద్రీనీవా జిల్లాలోకి ప్రవేశ ద్వారమైన గుంతకల్లు మండలం బుగ్గ సంఘాల నుంచి జీ.కొట్టాల వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువ మండల పరిధిలోని ప్రవహిస్తోంది. అయితే పరీవాహక ప్రాంతంలో ఇరువైపులా భూములకు సాగునీటి కేటాయింపులు లేని కారణంగా రైతులు ముందు నీళ్లున్న భూములకు రాని పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యమో, పాలకుల నిర్లక్ష్యమో కానీ రైతుల పాలిట మాత్రం శాపంగా మారింది. గతంలో గుంతకల్లు సబ్ బ్రాంచ్ కెనాల్ ద్వారా తుంగభద్ర జలాలు ప్రవహించేవి. దీంతో గుంతకల్లు మండలంలోని పాతకొత్తచెరువు, వైటీ చెరువులతోపాటు చెన్నరాయునికుంట రిజర్వాయర్‌కు నీటిని మళ్లించే వారు. అయితే తుంగభద్ర జలాలు జీఎస్‌బీసీని చేరుకోకపోవడంతో పూర్తిస్థాయిలో తుంగభద్ర జలాలు బంద్ కావడంతో చెరువు కింద ఉన్న ఆయకట్టు భూములు బీడు భూములుగా మారాయి. దీంతోపాటు గుంతకల్లు మున్సిపాలిటీకి తాగునీటి ఎద్దడిని చవిచూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో విడుదలైన హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలను నియోజకవర్గానికి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నియోజకవర్గంలో ఎకరాకు సాగునీటి కేటాయింపులు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా జీఎస్‌బీసీ ద్వారా వస్తున్న తుంగభద్ర జలాలు పాతకొత్తచెరువు, వైటీ చెరువులతో వరకు వచ్చేవి. దీంతో పాతకొత్తచెరువు కింద 446 ఎకరాలు, వైటీ చెరువు కింద 903 ఎకరాలు, గుత్తి చెరువు కింద 1037 కింద ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరందడంతో పంటలు పండించుకునేవారు. అయితే తుంగభద్ర జలాలు ఐదారేళ్లుగా జీఎస్‌బీసీకి బంద్ కావడంతో ఆయకట్టు భూములు బీడు భూములుగా మారాయి. ఇప్పటికి అనధికారికంగా పాతకొత్తచెరువు, వైటీ చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. భవిష్యత్‌లో హంద్రీనీవా కాలువ కృష్ణాజలాలు నీటి కేటాయింపులు లేకపోతే నీటిని వినియోగించుకునే అవకాశం ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క నియోజకవర్గమైన ఉరవకొండకు ముఖ్యమంత్రి 1.8 లక్షల ఎకరాల సాగునీటిని అందించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు పనులు సాగుతున్నాయని, గుంతకల్లు నియోజకవర్గానికి సాగునీటి విడుదల పట్ల ప్రజాప్రతినిధులు చొరువ చూపాలని రైతులు కోరుతున్నారు

Related Posts