YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కడప రేణిగుంట కు ఫోర్ వే లైన్

కడప రేణిగుంట కు ఫోర్ వే లైన్

కడప రేణిగుంట కు ఫోర్ వే లైన్
కడప, 
కడప–రేణిగుంట రహదారి ప్రస్తుతం పది మీటర్లు కలిగి రెండు వరుసలుగా ఉంది. నాలుగు వరుసలు చేసేందుకు 20 మీటర్ల వరకు పెంచనున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖకు ల్యాండ్‌ అక్విడేషన్‌ చేపట్టాలని ఎన్‌హెచ్‌ఐ అధికారులు విన్నవించారు. డీపీఆర్‌  కూడా సిద్ధమైంది. గతంలో ఎన్‌ఎస్‌యూలో ఉన్న ఈ రహదారిని ఎన్‌హెచ్‌ఐఏపీకి అప్పగించడంతో ఎన్‌హెచ్‌ 716 అనే నంబరును కేటాయించారు. కడపజిల్లాతోపాటు కర్నూలు, చిత్తూరు, ఇతర పలు రాష్ట్రాల వాహనాలు ప్రతి నిత్యం ఇదే రహదారిలో తిరుగుతుంటాయి. దీంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విస్తరణ బాధ్యతలను ఎన్‌హెచ్‌ నుంచి ఎన్‌హెచ్‌ఐఏ కు అప్పగించారు. జాతీయ రహదారి–716 నంబరును కేటాయిస్తూ విస్తరణకు పూనుకున్నారు. డీపీఆర్‌ కూడా సిద్ధం చేశారు. దీంతో రెండు వరుసల రహదారి నాలుగు వరుసలుగా మారనుంది. భూ సేకరణ, నిర్మాణానికి కలిపి రూ. 2000 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనాలు కూడా సిద్దం చేశారు.కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఈ రహదారి విస్తరణ అంశంపై అధికారులతో చర్చించారు.. నిధుల విషయంలో కూడా కృషి చేశారు. ప్రారంభంలో ఎన్‌హెచ్‌ఐ అధికారులు రిమ్స్‌రోడ్డు నుంచి రేణిగుంట వరకు నాలుగు లేన్ల రహదారిని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడి నుంచి అలైన్‌మెంట్‌ మార్చి వైఎస్సార్‌ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకు విస్తరణ చేపట్టాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అధికారులకు సూచించడంతో చివరకు ఆయన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. కడప–రేణిగుంట రహదారి విస్తరణతోపాటు బద్వేలు నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు వరకు కూడా నాలుగు వరుసల రహదారిని నాణ్యతతో నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఐఏ అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేశారు. రాయలసీమ జిల్లాలతోపాటు బళ్లారి, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఇనుప ఖనిజం, గ్రానైట్‌ విదేశాలకు ఎగుమతి చేసేందుకు కృష్ణపట్నం పోర్టు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం నుంచి కడపజిల్లా బద్వేలుకు వరకు 138 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణ చేయనున్నారు. ఇందులో కొంత భాగాన్ని ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో నాలుగు వరుసలుగా విస్తరించినప్పటికీ తాజాగా ఎన్‌హెచ్‌ఐఏ తన ప్రమాణాల మేర పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమయ్యారు.

Related Posts