YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మళ్లీపెరిగిన బంగారం

మళ్లీపెరిగిన బంగారం

మళ్లీపెరిగిన బంగారం
ముంబై, 
ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో ధర రూ.38,700కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పైకి కదిలింది. దీంతో ధర రూ.37,500కు చేరింది.బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,150 పతనమైంది. దీంతో ధర రూ.47,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1,487.75 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 17.46 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts