75 ఏళ్లలోతల్లైన బామ్మ
జైపూర్,
నడి వయస్సు రాగానే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఇక వృద్ధుల్లో ఆ ఛాన్సే ఉండదు. అయితే, ఇటీవల లేటు వయస్సులో కూడా గర్భం దాల్చుతున్న వృద్ధులు.. ఆ లెక్కలన్నీ తప్పులేనని తేల్చేస్తున్నారు. పిల్లలు కనడానికి వయస్సుతో పని ఏముందని అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరుకు చెందిన ఎర్రమట్టి మంగమ్మ 74 ఏళ్ల వయస్సులో పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.తాజాగా మరో బామ్మ.. 75 ఏళ్ల వయస్సులో ఆడ బిడ్డకు జన్మనిచ్చి ఆమె రికార్డును బద్దలకొట్టింది. వృద్ధాప్యంలోనూ వీరు అంత సులభంగా గర్భం దాల్చడానికి కారణం.. ఐవీఎఫ్ విధానం.రాజస్థాన్‌లోని కోటాకు చెందిన వృద్ధురాలికి పిల్లలు లేరు. దీంతో ఆమె తమ బంధువుల బిడ్డను దత్తత తీసుకుంది. అయితే, అతడి భార్య ఆమెను కొట్టడంతో.. తానే సొంతంగా ఓ బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా కింకార్ ఆసుపత్రిలో ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చింది.డాక్టర్ అభిలాషా కింకార్ మాట్లాడుతూ.. ‘‘వృద్ధాప్యం వల్ల ఆమె తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.45 ఏళ్ల కిందట ఆమెకు క్షయ వ్యాధికి గురైంది. దీనివల్ల ఒక ఊపిరితీత్తి మాత్రమే పనిచేస్తోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విజయవంతంగా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాం. ఆ బిడ్డకు ఇంకా నెలలు పూర్తిగా నిండలేదు. ఆమె అనారోగ్య పరిస్థితుల వల్ల ఆరున్నర మాసాలకే బిడ్డను ప్రసవించింది’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆ బిడ్డ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.