రేపటి నుంచి ట్రెడా ప్రాపర్టీ షో
హైద్రాబాద్,
డ్రీమ్ హోమ్‌ను లేదా ప్లాట్‌ను కొనుక్కోవాలని ఎదురుచూస్తున్న నగర వాసుల కోసం ‘ట్రెడా ప్రాపర్టీ షో’ వచ్చేసింది. ఈ ఏడాది 10వ ఎడిషన్ ప్రాపర్టీ షోను ఈ నెల 18 నుంచి 20 వరకు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(ట్రెడా) ప్రకటించింది. ఈ ప్రాపర్టీ షోలో 100 మందికి పైగా బిల్డర్లు, డెవలపర్లు, బిల్డింగ్ మెటీరియల్ సరఫరాదారులు పాల్గొననున్నారు. అంతేకాక 300కు పైగా ప్రాపర్టీలను డెవలపర్స్, బిల్డర్స్ ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పూర్తి అవగాహన కల్పించుకోవాలని భావిస్తున్న వారికి ఈ ప్రాపర్టీ షో ఎంతో ఉపయోగపడుతుందని ట్రెడా సభ్యులు తెలిపారు. తొమ్మిదేళ్లుగా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించామని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్. చలపతిరావు తెలిపారు. ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి తాము సాయం చేయనున్నట్టు చెప్పారు.చాలా మల్టినేషనల్ కంపెనీలు సిటీలోకి వస్తున్నాయని, అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయడం తక్కువ రిస్క్‌తో కూడుకున్నదని, అంతేకాక ప్రజలు రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశం మొత్తం మీద మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లో ఉంటే, హైదరాబాద్‌లో మాత్రం ముందంజలో ఉందన్నారు. ప్రభుత్వ సపోర్ట్, కనెక్టివిటీ, అఫర్డబుల్ రియల్ ఎస్టేట్ మార్కెట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మెట్రోపాలిటన్ కల్చర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి కారణాలతో చాలా మల్టినేషనల్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నట్టు ట్రెడా సభ్యులు చెప్పారు. అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలన్నీ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కూడా రెండింతలు పెరిగాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఐటీ ఎక్కువగా డెవలప్ అయిందని, కానీ ఇప్పుడు సెల్‌ఫోన్ మానుఫాక్చరింగ్, వేర్‌హౌసింగ్‌కు కూడా భాగ్యనగరం హబ్‌గా మారుతుందని ట్రెడా ట్రెజరర్ శ్రీదర్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్‌లో మానుఫాక్చరింగ్ సెక్టార్ బాగా పెరుగుతుందని, ప్రస్తుతం ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి సరియైన సమయం అన్నారు. 2015 తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు ఇండస్ట్రీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. జహీరాబాద్‌లో 18 వేల ఎకరాల్లో నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందని, అందుకే అక్కడ రేట్లు అలా పెరిగిపోతూ ఉన్నాయని చెప్పుకొచ్చారు.సౌత్‌తో పాటు హైదరాబాద్ ఈస్ట్, నార్త్ వైపు కూడా షాపింగ్ మాల్స్, కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. చాలా ఐటీ కంపెనీలు ఉప్పల్ వైపు షిఫ్టవుతున్నాయని ట్రెడా సభ్యులు తెలిపారు. ప్రభుత్వం కూడా ఈస్ట్ వైపు అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. నగరంలో క్వార్టర్‌కు 5000కు పైగా యూనిట్లు అమ్ముడుపోయినట్టు చలపతి రావు చెప్పారు. 6 కోట్ల చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాంతం డెవలప్ అయినట్టు పేర్కొన్నారు. ప్రతేడాది 30 వేల యూనిట్లకు పైగా లాంచ్ అవుతున్నట్టు చెప్పారు. రెసిడెన్షియల్ స్పేస్‌లో మంచి గ్రోత్‌ను చూస్తున్నామన్నారు. 2025 నాటికి 25 కోట్ల చదరపు అడుగల నుంచి 30 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను టేకప్ చేయాలనుకుంటున్నట్టు కూడా తెలిపారు. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌ను దేశం మొత్తం మీద కంటే ఎక్కువగా పెంచనున్నామని చెప్పారు.