తొలినుంచి వివాదాల్లో నిలుస్తున్న బాలీవుడ్ చిత్రం ‘పద్మావత్’కి సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు 25న విడుదలకు నోచుకుంటోంది.
సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమా విడుదలపై నిషేధం విధించాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ‘పద్మావత్’ నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా విషయంలో సుప్రీం గురువారం తీర్పునిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. దాంతో భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. దీపిక పదుకొణె ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్ది్‌న్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.